KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం
- సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్ చేసిన పనులు ఏవైనా ఉన్నాయా అంటే అవి బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు చేరవేయడమే తప్పా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం లాగ మారిపోయిందని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును చేర్చడం తెలంగాణకే ఎంతో అవమానం అని అన్నారు.
Also Read:Vijayawada: విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు..!
Also Read
గతంలో కేస్ ల తర్వాత ఆయన వైఖరి మారుతుంది అనుకున్నారు.. కానీ మారలేదు. అప్పట్లో ఓటుకు నోటు కుంభకోణం చేస్తే ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా చెప్పారు. డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు అని చెప్పారు. ఇప్పుడు అదే విషయం స్పష్టం అయింది. బీజేపీకి నిజాయితీ ఉంటే.. స్పందించాలి అని కోరారు. అమృత్, సివిల్ సప్లై స్కామ్, యంగ్ ఇండియా, హెచ్ సీయూ భూముల విషయంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని తేల్చింది. 10 వేల కోట్ల విషయంలో స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారణ జరిపించాలని రిపోర్ట్ ఇచ్చింది.
Also Read:Rajanna Siricilla: బైకులోకి దూరిన పాము.. పార్ట్స్ అన్నీ ఊడదీసినా.. చివరకు
సీఎం రేవంత్ 44 వ సారి ఢిల్లీ వెళ్లారు.. నిన్న రాత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు.. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కి ఇద్దరు బాసులు ఉన్నారు.. ఒక బాస్ రేవంత్ రెడ్డి అయితే.. మరోబాస్ నరేంద్ర మోడీ, అమిత్ షా లు.. వాళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు.. రేవంత్ రెడ్డి వెంటనే తప్పుకోవాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజీనామా చేయించాలి.. నేషనల్ హెరాల్డ్ కేస్ లో తన పేరు వస్తుంది అనే జపాన్ పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లారు..
Also Read:Karnataka: దారుణం.. భార్యపై కోపంతో పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి హత్య
ఇంత ఇంపార్టెంట్ టైం లో దయ్యాలా విషయం ఎందుకు.. ఇప్పుడు తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి.. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చాలామంది కేసీఆర్ కు ఉత్తరాలు రాశారు.. ఎవరైనా కేసీఆర్ కు ఉత్తరాలు రాయొచ్చు.. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాలి.. ఎవరైనా సరే అంతర్గతంగా మాట్లాడాలి.. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు.. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు.
- Tags
- CM Revanth Reddy
- ktr
- telangana
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?