ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి.. ఉచిత సలహా ఇచ్చి బంగారు ఆభరణాలను అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న ఆ దంపతులు బేల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కౌట గ్రామానికి చెందిన సంతోష్, వందనలు తమ ద్విచక్ర వాహనంపై మాంగ్రూడ్ గ్రామం వెళ్లి…
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. షిర్ జోన్లో తవ్వకాలు అసాధ్యం అని రెస్క్యూ బృందాలు అంటున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. నోగో జోన్లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. సుదీర్ఘంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్లో రెండు మృతదేహాలను వెలికితీశారు. ఫిబ్రవరి 22న జరిగిన…
నేటి నుంచి ‘రైతు మహోత్సవం’ వేడుకలు ఆరంభం కానున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రైతు మహోత్సవం నేపథ్యంలో నేడు జిల్లాలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. రాష్ట్ర రైతు మహోత్సవం మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరంబించనున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ…
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు అలీ (45), అజీం బేగం (40), ఎండీ గౌస్ (1)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో…
Poguleti Srinivas Reddy : జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో శనివారం జరిగిన “భూభారతి 2025” చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తీసుకొచ్చిన భూభారతి చట్టం పేద రైతులకు మహా ప్రసాదంగా నిలుస్తుందని చెప్పారు. పొంగులేటి ధరణి చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తూ, అది కొద్ది మంది వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని…
ఆరోగ్య సమస్యల వల్ల తాను దుబాయ్ వెళ్లానని, కార్యకర్తలకు దూరమయ్యానని బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టొద్దని సీపీకి విన్నపం చేశానన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన కొడుకుపై కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27న వరంగల్లో బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరగనుంది. రజతోత్సవ సన్నాహాక సమావేశ కార్యక్రమం బోధన్ అప్న ఫంకషన్లో…
తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, నిన్న హైడ్రా కూల్చివేసిన సర్వే నంబర్పై ఎలాంటి కేసు లేదని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 79/1, 79/2 సర్వే నంబర్ రెగ్యులరైజ్ అయ్యిందని.. గతంలో అన్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు తమది కుడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారన్నారు. అన్ని డాక్యుమెంట్స్ నెల రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి స్వయంగా అందించానని, ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారని మండిపడ్డారు. హైడ్రా…
పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్, చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని ఐదో అంతస్తు ఆడిటోరియంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది…
త్వరలో జరిగే రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నష్టపోయింది కేసీఆర్, బీఆర్ఎస్ కాదని.. ప్రజలే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలకు ముసలోళ్లు, మహిళలు, నిరుద్యోగులు మోసపోయారన్నారు. మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? అని, బీజేపీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నేతలు బీఆర్ఎస్లో…
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు మహోత్సవం’ నిర్వహిస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు (ఏప్రిల్ 21 నుంచి 23 వరకు) ఈ మహోత్సవం కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 150 స్టాళ్లు నెలకొల్పాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా…