తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయి ఎమ్మెల్యే సీట్లు దక్కాయి కాంగ్రెస్ పార్టీకి. మొత్తం పదమూడుకు గాను గతంలో ఎన్నడూ లేని విధంగా 2023 ఎన్నికల్లో 8 సీట్లు హస్తగతం అయ్యాయి. మిగతా ఐదు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది... ఆ సీట్లలో పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు... వీధి పోరాటాలకు దిగడం చర్చనీయాంశం అయింది.
ఏపీ సరిహద్దులో ఉండే తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావు పేట. పేరుకు గిరిజన నియోజకవర్గం అయినా... అజమాయిషీ మాత్రం వేరే వర్గాలదే. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా బండి లాగించేశారు.
పటాన్చెరు నియోజకవర్గం. గత మూడు విడతల నుంచి గులాబీ జెండా ఎగిరిన సెగ్మెంట్. ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు గూడెం మహిపాల్‌రెడ్డి. తొలి రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా... మూడోసారి అంటే... 2023లో అధికారం పోవడంతో... కారు దిగేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మహిపాల్‌రెడ్డి. నిరుడు జులై 15న కాంగ్రెస్ గూటికి చేరారాయన. ఆ క్రమంలోనే...లోకల్ కేడర్‌కి భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం.
ACB : తెలంగాణలో హల్చల్ రేపిన గొర్రెల పంపిణీ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆయనపై లుక్ఔట్ నోటీస్ (LOC) జారీ చేయగా, హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచీ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఈక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. ఇద్దరి పాస్‌పోర్టులను అధికారులు ఇప్పటికే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్లో ఏపీ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు గురువారం రాత్రి ఆపేశారు. దీంతో తంగెడ కృష్ణానది బ్రిడ్జిపై ధాన్యం లారీలు భారీగా నిలిచిపోయాయి. ధాన్యం లారీల నిలిపివేతతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణానది బ్రిడ్జిపై లారీలు అడ్డంపెట్టి డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలను వెంటనే పంపాలంటూ ఆందోళన చేపట్టారు. Also Read: Shreyas Iyer-BCCI: చూసుకోవాలి కదా శ్రేయాస్…
Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.