Telangana Cabinet: రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. నిన్న ఢిల్లీకి వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. ఈరోజు రాత్రికి హైదరాబాద్ రానున్నారు. అయితే, కొత్తగా కేబినెట్ లోకి ముగ్గురిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గంలో కూడికలు, తీసివేతలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇద్దరు మంత్రులను తప్పించే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు టాక్. సామాజిక న్యాయం కూర్పులో భాగంగా మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ నియామకం కూడా పూర్తి చేయాలని యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.
Read Also: Telangana Film Chamber : పవన్ ‘హరిహర వీరమల్లు’ కోసం థియేటర్లను ఖాళీగా ఉంచాం!
అయితే, కేబినెట్ లోకి ముగ్గురు లేదా నలుగురు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు ఉండగా, బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ లకు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మైనార్టీకి మంత్రి పదవి చోటు దక్కనుంది. మరోవైపు, మాదిగ, లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని హైకమాండ్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాత్రికి మార్పులు చేర్పులపై అధిష్టానం స్పష్టత ఇచ్చిన తర్వాత మంత్రి వర్గంలో ఎవరికి చోటు లభించనుందో తెలుస్తుంది.