తెలంగాణ సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్. గడిచిన పదేళ్ళుగా... ఐటి, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్గా కొనసాగుతూ వచ్చారాయన. కానీ... ఇటీవల జరిగిన బదిలీల్లో స్పీడ్ సీఈఓగా ఆయన్ని నియమించింది ప్రభుత్వం. కానీ... ఇప్పటి వరకు ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రత్యేక ఆఫీసు అంటూ ఏది లేదు. దాని కోసం వెదుకులాట కొనసాగుతోందట.
తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే మందుల సామేల్ వెంట ఉంటే.. మరొక వర్గం జిల్లా సీనియర్ నేతల వెంట నడుస్తోందన్నది ఓపెన్ టాక్. కొంత కాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటలు పేలుతున్నాయి.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు.
ACB: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదుతో దూసుకెళ్తుంది. కేవలం 2025 ఏప్రిల్ నెలలో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి.
Minister Ponguleti: భూ భారతి పోర్టల్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతికి అనూహ్య స్పందన లభిస్తుంది. నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి అయ్యాయి.
Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.
Telangana CM: మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.. కార్మికులు సమ్మె ఆలోచన వీడండి అని కోరారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది అన్నారు.
Kishan Reddy: ప్రధాని మోడీ నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
CM Revanth Reddy: రవీంద్ర భారతిలో జరుగుతున్న మేడే వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారానికి ఒకరోజు సెలవు.. కార్మికుల పోరాట ఫలితమే అన్నారు.