బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించారు. ఈ ఉదయం ఆరోగ్యం మరింత విషమించడంతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గోపినాథ్ కి గతంలో డయాలసిస్ పై చికిత్స అందించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గెలిచారు. ఆయన మరణ వార్త తెలియగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.