Bar License Applications: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బార్లకు భారీగా దరఖాస్తులు..
- జీహెచ్‌ఎంసీ పరిధిలోని బార్లకు భారీగా దరఖాస్తులు..
- గ్రేటర్ పరిధిలోని 24 బార్ల టెండర్లకు 3668 అప్లికేషన్లు..
- ఈ నెల 13న డ్రా పద్ధతి ద్వారా బార్ హోల్డర్స్ ఎంపిక కొనసాగనుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bar License Applications: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు భారీ ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 అప్లికేషన్లు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు 3,520 దరఖాస్తులు రాగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలోని నాలుగు బార్లకు 148 అప్లికేషన్లు వచ్చాయి. అయితే, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పరిధిలోని జల్‌పల్లి మున్సిపాలిటీలోని ఒక్క బార్‌కు 57 దరఖాస్తులు, మహబూబ్‌నగర్‌లోని బార్‌కు 49, నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని బార్‌కు 15 అప్లికేషన్లు వచ్చాయి.
Read Also: Kannappa: హరిహర వీరమల్లుపై వివాదం చేసిన వాళ్ళు కన్నప్పపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారు?
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
అయితే, ఈ మొత్తం అప్లికేషన్ల ద్వారా ఎక్సైజ్ శాఖకు సుమారు రూ.36.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లకు వచ్చిన దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ డ్రా ద్వారా బార్ల యజమానులను సెలక్ట్ చేస్తారు. జిల్లాల్లోని బార్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన డ్రా పద్ధతి ద్వారా బార్ హోల్డర్ ఎంపిక కొనసాగుతుందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ వెల్లడించారు. డ్రా పద్దతిని ఎక్కడెక్కడ అనే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!