Wife Kills Husband: మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య.. మద్యం మత్తులో భర్త స్వామి (35) చెరువులో పడి చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నం చేసింది.
టీటీడీ గోవిందరాజస్వామి ఆలయంలో వ్యక్తి హల్చల్.. మహా ద్వారం గోపురం పైకి ఎక్కి..! తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించే ఘటన చోటుచేసుకుంది. స్వామివారి ఏకాంత సేవ ముగిసిన అనంతరం, విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మద్యం మత్తులో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కలకలం రేపాడు. ఆలయం వెనుక భాగం గోడ దూకి లోపలికి ప్రవేశించిన అతడు, భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే మహా ద్వారం లోపలి…
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు (జనవరి 3న) తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజయ్య స్వామిని దర్శించుకోనున్నారు.
* బళ్లారి: వాల్మీకి విగ్రహావిష్కరణ వాయిదా .. నేడు బళ్లారిలో ఎస్సీ సర్కిల్లో వాల్మీకి విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ .. నిన్న జరిగిన పరిణామాలు , కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందడంతో వాయిదా .. కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు, 144 సెక్షన్ కొనసాగింపు * హైదరాబాద్: నేడు మూడో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. * హైదరాబాద్: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జలాల…
హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య రీతిలో దిగి వస్తూ శాసనసభ నిబంధనలు లేకుండా సభను నడుపుతున్నారని ఆరోపించారు. బీఏసీలో మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు వేరు అసెంబ్లీలో పెట్టినవి వేరు.. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు పెట్టకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
న్యూఇయర్ వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ.. కత్తి, బీర్ బాటిళ్లతో దాడి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పి. గన్నవరం మండలం ఉడిముడి (ఉడుముడి) గ్రామంలోని శివాలయం సమీపంలో కొంతమంది యువకులు చలిమంట కాగుతూ న్యూఇయర్ను స్వాగతించే ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో మరో వర్గానికి చెందిన యువకులు అక్కడకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవకు దిగారు. ఒక యువకుడిని చాకుతో పొడిచారు.. మరొకరిపై పగిలిన బీర్…
Kavitha vs Harish Rao: తెలంగాణ శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మరోసారి హరీష్రావును టార్గెట్ చేసింది. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు వేసింది. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారు?..
Harish Rao: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా కొనసాగాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక్క నిమిషం వినండి.. అందరి సభ్యులకు హక్కులు ఉంటాయి.. అందరి హక్కులు కాపాడాలి.. బీఏసీ సమావేశం అజెండాను సభలో పెట్టారు.
కేసీఆర్ సభకు రాకుండా టీఆర్ఎస్ ను సర్వ నాశనం చేసిన హరీష్ రావుకు పాలమూరు మీద మాట్లాడే అవకాశం సభలో ఇవ్వడం ఏందీ అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించింది. అప్పుడు జగన్ మెహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబులు తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం చేశారు.