పేకాటకు అనుమతి ఇవ్వాలని పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన మూడు క్లబ్‌లకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. 13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్.. అయితే, విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.. డబ్బులు పందెంగా పెట్టి కార్డ్స్ ఆడటం చట్ట విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ, క్లబ్‌ల…
బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా? గట్టి వాదనలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశాన్ని చేజేతులా వదులుకుందా? ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని బేస్ చేసుకుని రేపు కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉందా? ఏ స్టాండ్ గులాబీ పార్టీకే బెడిసి కొడుతుందన్న చర్చలు మొదలయ్యాయి? ఏంటా వ్యవహారం? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. తొలి రోజు సభకు జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్….ఇక ఆ తర్వాత…
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కోవర్ట్‌లు ఉన్నారా? అదీకూడా… పై స్థాయిలోనే ఉన్నారా? ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే సమాచారాన్ని ప్రతిపక్షానికి చేరవేస్తున్నారా? ఆ దొంగలెవరో ఇప్పుడు రేవంత్ సర్కార్ పసిగట్టేసిందా? హిల్ట్ పాలసీ లీక్‌తో తీగ లాగితే డొంకలే కదులుతున్నాయా? ఇంతకీ ఎవరా కోవర్ట్‌లు? వాళ్ళ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పాలసీ హిల్ట్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో… పారిశ్రామిక వాడల్లో మల్టీపర్పస్ జోన్స్ అభివృద్ధికి…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ కన్ఫామ్ అయిపోయిందా? ఇన్నాళ్ళు ఉన్న అనుమానాలకు తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చేశారా? వ్యక్తిగా బయటికి వెళ్తున్నాను. తిరిగి రాజకీయ శక్తిగా సభలో అడుగుపెడతానని చెప్పడం వెనక ఉద్దేశ్యం పార్టీ ఏర్పాటేనా? మరి ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయా? పార్టీ ఏర్పాటులో ఆమె ఏ ఫార్ములాను అనుసరించబోతున్నారు? ఎమ్మెల్సీ పదవికి గతంలోనే రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత తాజాగా సభలో అందుకు కారణాలను వివరించారు. తనకు బీఆర్ఎస్లో తీవ్రమైన అవమానాలు…
ఇరుసుమండ బ్లోఅవుట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ పై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.. అయితే, బ్లోఅవుట్ ప్రాంతంలో గ్యాస్ లీక్‌ను అరికట్టడం, మంటలను నియంత్రించడం కోసం వివిధ శాఖలు చేపడుతున్న చర్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్, హోంమంత్రి వంగలపూడి అనిత సీఎంకు వివరించారు. బ్లోఅవుట్ ప్రాంతంలో ఇంకా మంటలు ఆరలేదు,…
కుటుంబ గొడవలపై ఎమ్మెల్సీ కవిత మొదటిసారి స్పందించారు. తనది ఆస్తుల పంచాయితీ కాదుని, ఆత్మగౌరవ పంచాయితీ అంటూ.. తాను ఇష్టంగా కొలిచే లక్ష్మీ నరసింహ స్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేశారు. నైతికతలేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని.. అందుకే రాజీనామా చేశా అని చెప్పారు. తన రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని కవిత కోరారు. శాసనమండలిలో కవిత భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. ‘ఇసుక…
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.. ఎయిరిండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ పనుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27).. ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లగేజీని టెర్మినల్ నుంచి ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక…
శాసనమండలిలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర భావోద్వేగం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారన్నారు. పార్టీ మౌత్ పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు తనకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ప్రశ్నిస్తే మాజీ సీఎం కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు కక్షగట్టారని చెప్పారు. బీఆర్ఎస్లో మొదటి నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని శాసనమండలిలో ఎమ్మెల్సీ…