తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు సిఎం కెసిఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు లక్షా ఇరవై వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్ననేపథ్యంలో, మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు సిబ్బందికి కూడా వారికి అందిస్తున్న విధంగా 2000…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,976 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,97,361 కి చేరింది. ఇందులో 4,28,865 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 65,757 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
సిఎం కెసిఆర్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందని.. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. “తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయింది. పగటి పూట నియంత్రణలేమీ లేవు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్వల్పకాల లాక్డౌన్ విధించాయి. మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించే విషయం గురించి సిఎం కెసిఆర్ లోతైన విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…..తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం…
మాములు రోజుల్లో సమ్మర్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. డిమాండ్‌కు తగిన విధంగా సమ్మర్లో కోళ్ల సప్లై ఉండదు. అందుకే ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం. గత నెలలో రూ.270 వరకు ఉన్నధరలు ఇప్పుడు రూ.150కి పడిపోయింది. కరోనా మహమ్మారి విజృంభణ, కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ వంటివి అమలు జరుగుతుండటంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఈ ధరలు మరింతగా తగ్గే…
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసరప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల నుండి దక్షణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి రాగల 3 రోజులు (06,07,08వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్ధాయి సమావేశం ప్రగతి భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కీలక అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రగతి భవన్లో సమావేశం జరుగుతున్నది. మే 8 వ తేదీతో నైట్ కర్ఫ్యూ సమయం ముగియనున్నది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో…
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటె, గతనెల 19 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు. ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని,…
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా భయంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు ప్రజలు. కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో క్యూలు ఉంటున్నాయి. క్యూలైన్లో ఎక్కువ మంది నిలబడితే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో ప్రజలు తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డులను క్యూలైన్లో ఉంచి దూరంగా నిలబడుతున్నారు. ఒకప్పుడు సినిమా హాళ్ల ముందు ఎక్కువ క్యూలైన్లు కనిపించేవి. ఈ కరోనా కాలంలో హాస్పిటల్స్ ముందు, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో…