తెలంగాణలో రేపటి నుంచి కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో లాక్‌డౌన్ నిబంధనలు మారనున్నాయి. మరో పదిరోజుల పాటు కొనసాగనున్న లాక్‌డౌన్.. సడలింపు సమయం పెరగనుంది. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలింపు సమయం.. ఆ తర్వాత మరో గంట గ్రేస్ పీరియడ్‌గా ఉంది. రేపట్నుంచి ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు లాక్‌డౌన్ నుంచి సడలింపు ఉండనుంది. ప్రజలంతా ఇళ్లకు చేరుకునేలా మరో గంట వెసులుబాటు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 గంటల వరకు.. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయనుంది ప్రభుత్వం. రాత్రి మొత్తం లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కేబినెట్ ఆదేశాలతో.. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు సన్నద్ధమైంది పోలీసుశాఖ. అయితే, సడలింపు సమయం పెంపుతో ప్రజలతో పాటు, వ్యాపార వాణిజ్య వర్గాలు ఊపిరిపీల్చుకోనున్నాయి.
మరోవైపు.. కరోనా పూర్తిగా అదుపులోకి రాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాత లాక్‌డౌన్ రూల్సే అమలుకానున్నాయి. అక్కడ ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం రెండింటి వరకే సడలింపు ఉండనుంది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్‌డౌన్ ప్రారంభం కాగా.. 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు సమయాన్ని మరో నాలుగు గంటలు పెంచుతూ.. రెండోసారి లాక్‌డౌన్‌ను మే 31 నుంచి జూన్ 9 వరకు పొడిగించారు. ఇప్పుడు మరోసారి సడలింపు సమయం పెంపుతో.. జూన్ 19 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది.
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
తాజావార్తలు
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!