ఒకే గ్రామం.. రెండు లాక్‌డౌన్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్త లాక్‌డౌన్ సడలింపులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. కానీ, కేసుల తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. ఇంకా పాజిటివ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.. అయితే, రెండు జిల్లాలను కలుపుతూ ఉన్న ఒక పంచాయతీలో మాత్రం.. రెండు లాక్‌డౌన్‌లు అమలు చేయాల్సిన పరిస్థితి.. అదే ఇటు రంగారెడ్డి జిల్లా, అటు నల్గొండ జిల్లాలను కలుపుతూ ఉన్న మాల్.. కొత్త సడలింపులతో రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. నల్గొండ జిల్లాలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే పరిమితం.. దీంతో.. ఈ గ్రామంలో విచిత్రమైన పరిస్థితి తలెత్తింది.. గోడకొండ్ల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు.. మాల్ గ్రామపంచాయతీ పరిధిలో సాయంత్రం 6గంటల వరకు సడలింపులు అమలు చేస్తున్నారు అధికారులు. కాగా, హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేపై ఉండే మాల్ మంచి వాణిజ్య కేంద్రం.. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు.. హైదరాబాద్ శివారుల నుంచి కూడా కూరగాయలు అమ్మేవారు.. అక్కడికి వెళ్లి కూరగాలు తీసుకువస్తుంటారు.. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. గతంలో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ గ్రామం ఉండేది.. తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత.. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాంతం.. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి రావడంతో.. ఇప్పుడు రెండు జిల్లాల్లో మాల్ గ్రామ పరిధి ఉంది.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!