ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు.…
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల విషయంలో నిబంధనలు మరింత కఠినం చేసింది. తెలంగాణ బోర్డర్ లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమే. హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టింది. ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టం అని అన్నారు. అంబులెన్స్ ను…
తెలంగాణలో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి లాక్డౌన్ను విధించింది. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డర్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను హైదరాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. దీంతో చెక్ పోస్టుల…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,693 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,16,404 కి చేరింది. ఇందులో 4,56,620 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 71,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 33 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు జారుతున్నది. లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు. నాలుగు గంటలపాటు లాక్ డౌన్ కు సడలింపులు అనటంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు రావడంతో రద్దీ ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా నగరంలోని ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. బస్సులు తక్కువగా ఉంటడం, ఉదయం 10 గంటల తరువాత బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు అవస్థలు…
lockdown-effect-changes-in-the-working-hours-of-banksతెలంగాణలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్లో 50% సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నిన్న సమావేశమై.. ప్రభుత్వ నిర్ణయానికి సహకారం అందిస్తూనే వినియోగదారులకు కూడా సేవలు అందించాలని ఈ నిర్ణయం…
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు…
టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు. ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,723 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711 కి చేరింది. ఇందులో 4,49,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 59,113 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 31 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
తెలంగాణలో ఈరోజు నుంచి లాక్డౌన్ అమలులో ఉన్నది. పది రోజులపాటు లాక్డౌన్ అమలు జరుగుతున్నది. లాక్డౌన్ ప్రకటన తరువాత తెలంగాణలో మద్యం కోసం మందుబాబులు ఎగబడిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే తెలంగాణలో ఏకంగా రూ.125 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. లాక్డౌన్ మొదటిరోజు కూడా పెద్దసంఖ్యలో అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈరోజు ఏకంగా రూ.94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక ఇదిలా ఉంటే, ఈనెల 1వ తేదీ నుంచి 12వ…