దేవుడి దగ్గర కూడా రాజకీయాలా? అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలకు అనుమతి లేదని టీటీడీ జేఈవో చెప్పడం సరికాదన్న ఆయన.. తిరుమల వేంకటేశ్వర స్వామి అందరివాడు.. ఇలాంటి వివాదాలు పెరిగితే రాబోయే రోజుల్లో పెద్ద తుఫాన్‌గా మారుతుందని హెచ్చరించారు.. దేవుడి వద్ద కూడా రాజకీయాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా..? అని ప్రశ్నించారు.. ఇది దుర్మార్గమైన చర్యలు పెంచుకుంటూ పోతే ఇద్దరు సీఎంలకు మంచిదికాదని హితవుపలికారు. ఇక, జలవివాదాలతో కేసీఆర్, జగన్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి.. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోకుండా.. వివాదాన్ని మరింత పెంచుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. షర్మిల పార్టీపై స్పందించిన ఆయన.. వైఎస్ షర్మిల తెలంగాణ కోడలే అయినా.. ఆమెది రాయలసీమ రక్తమే కదా..? అని వ్యాఖ్యానించారు.. అన్న అక్కడ.. చెల్లెలు ఇక్కడ.. ఏంటి ఈ నాటకాలు..? అని ఫైర్ అయ్యారు. ఇక, విశాఖ స్టీల్ విషయంలో కార్మికులు రోడ్ల పైకి వచ్చినా సీఎం జగన్ నోరు ఎందుకు మెదపడంలేదని ప్రశ్నించారు జగ్గారెడ్డి.