రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్.. ఆయా రంగాల వారీగా పరిశ్రమలు మరియు ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు…
ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మరింత ముదురుతూనే ఉంది.. తాజాగా, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణలో ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించగా.. ఏపీ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదన్న ఆయన.. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు.. ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆయన..…
తెలంగాణలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో జూన్ 23 నుంచి 10 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో జూలై 1వ తేదీ నుంచి మరో 45 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రేపటి నుంచి 55 ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 45…
కరోనా సమయంలో పీజీ విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది ఉస్మానియా యూనివర్సిటీ… పీజీ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది… విద్యార్థి తనకు ఏ సెంటర్ అందుబాటులో ఉందని భావిస్తున్నాడో… ఏ సెంటర్లో పరీక్ష రాయాలని అనుకుంటున్నాడో.. ముందే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకవేళ ఒక సెంటర్ లో 20 మంది విద్యార్థులు ఉంటే ఆ సెంటర్ ను మార్చడం జరుగుతుందని ఓయూ తెలిపింది..…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 917 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1,006 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కు చేరగా.. రికవరీ కేసులు 6,06,461కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పొన్నం అశోక్ గౌడ్.. వైస్ ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ముర్తుజా పాషా ఎన్నికైయ్యారు. సెక్రెటరీగా కళ్యాణ్ రావు, సుజన కుమార్ రెడ్డి నియమితులైయ్యారు. అధ్యక్ష పదవితో పాటు మొత్తం 15 పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మెత్తం 4444 మంది న్యాయవాదులు ఓట్లు ఉండగా, 2967 మంది న్యాయవాదులు తమ ఓటు వినియోగించుకున్నారు. కోవిడ్ కారణంగా ఈసారి ఆన్లైన్…
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి బాబుమోహన్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించిన బాబుమోహన్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. గతంలో ఉన్న సీఎంలు ఎవ్వరు కూడా ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టలేదన్నారు. రైతుబంధు వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఒరుగుతున్నది ఏమీలేదని బాబు మోహన్ ఆరోపించారు. కేసీఆర్ పాలన వలన పేదలకు ఏమి లాభం లేదని,…
గెలిచేవరకు ఒక టెన్షన్. గెలిచిన తర్వాత పదవి నిలుపుకొనేందుకు మరో టెన్షన్. నియోజకవర్గంలో పట్టు సాధించడంతోపాటు.. పార్టీలోని ప్రత్యర్థులపైనా ఓ కన్నేసి ఉంచాల్సిందే. లేదంటే వచ్చే ఎన్నికలనాటికి టికెట్ గ్యారెంటీ ఉండదు. ప్రస్తుతం ఆ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి అదేనట. సిట్టింగ్లు.. ఫిట్టింగ్లు ఓ రేంజ్లో రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే టికెట్ కోసం…
ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. ఆ బస్సులో ఉన్న ఓ మహిళ మృతిచెందడంతో పాటు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అచ్యంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు… కల్వకుర్తి నుంచి అచ్చంపేట వైపు వెళ్లే సమయంలో ప్రమాదానికి గురైంది.. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో.. బస్సులో ఉన్న నర్సమ్మ (50)అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు.. మరో…
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో చెట్లు నాటడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. చెట్లు నాటడమే కాదు.. వాటి పరిరక్షణ బాధ్యతను కూడా సీరియస్గా తీసుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు విడతలుగా హరితహారం నిర్వహించగా… ఏడో విడతకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం… ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు మొక్కలు… నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు.. 2015లో ప్రారంభమైంది హరితహారం 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకుంది.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నర్సరీల సంఖ్య 15,241గా…