తెలంగాణలో త్వరలో రెండవ విడత గొర్రెల పంపిణీ ప్రారంభం కానున్నట్లు సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామన్న ఆయన… రెండో విడత పంపిణీ కోసం మరో 6000 కోట్ల రూపాయలు కేటాయించామని స్పష్టం చేశారు.
read also : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..
ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగింపు ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్.. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. బిసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇలాంటి పథకాలు తీసుకువస్తున్నామని చెప్పారు. సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.