భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ నిండు కుండలా మారింది.. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.90 అడుగులకు చేరింది నీటిమట్టం దీంతో.. దిగువప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. మొదటగా మూడు గేట్లను ఎత్తి దిగువకను నీటిని విడుదల చేస్తున్నారు.. హిమాయత్‌సాగర్‌కు మొత్తం 17 గేట్లు ఉండగా… 5వ నంబర్ గేట్ ను ఎత్తిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. మూసి నదిలోకి నీటిని వదిలారు.. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇలానే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తివేస్తామని చెబుతున్నారు అధికారులు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అంటే చెరువులన్నీ నిండటమే అన్నారు.. అన్నీ ఆలోచించే గేట్లు ఎత్తే నిర్ణయం తీసుకున్నామని… మూసి పరివాహక ప్రాంతవాసులందరిని అప్రమత్తం చేశామని వెల్లడించారు.