తెలంగాణ మళ్లీ కరోనా కేసులు పెరిగాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,362 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,05,455కు పెరిగాయి… ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,651 మంది మృతిచెందారు.. కరోనా…
తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర అ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి , వివిధ శాఖ అధిపతులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల… తెలంగాణలో రాజన్నరాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ప్రకటించారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆదిలోనే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.. ఎందుకంటే.. అప్పటి వరకు తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి… ఏప్రిల్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు.. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేసిన ఆయన.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ఏపీ…
తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఈ చర్యలకు పూనుకుంది.. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655…
రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినేట్ సమావేశంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీరణ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ. 5900 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. read also : ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ , ఇంటర్ పరీక్షలు…
రైతు బంధు పథకం డబ్బుల విషయంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి… ఈటల రాజీనామా తర్వాత ఆయన రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు ఎంత అందుకున్నది అనే లెక్కలు వైరల్‌గా మారిపోయాయి.. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన పల్లా… రైతు బంధు వద్దు అనిపించినప్పుడు సీఎం కేసీఆర్‌కు ఎందుకు చెప్పలేక పోయారంటూ ఈటలను నిలదీశారు.. ఇక, హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25…
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం జులైలో జరగాల్సిన ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. మినిమం పాస్ మార్కులు వేసి అందరిని ఉత్తీర్ణులను చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది అడ్మిషన్స్ , పరీక్ష ఫీజు చెల్లించిన వారి సంఖ్య పెరిగింది. read also : తెలంగాణలో ఈ రోజు నుండి…
నిన్నటి తెలంగాణ & పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీన పడినవి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశ నుండి తెలంగాణా రాష్ట్రం లోనికి వస్తున్నవి. ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు ప్రదేశాల్లో రేపు కొన్ని ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణ హెచ్చరికలు:- రేపు, ఎల్లుండి భారీ వర్షములు…
తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. పీసీసీ వస్తుందని.. ఇన్నాళ్లూ కాన్ఫిడెన్స్‌తో ఉన్న వెంకన్నకి అధిష్ఠానం హ్యాండ్ ఇచ్చింది. ఆయన బరస్ట్ అయ్యారు కూడా. మరి.. రాజకీయంగా అన్నదమ్ముల దారెటు? ఇద్దరూ ఒకేవైపు అడుగులు వేస్తారా.. ఇంకేదైనా ప్లాన్స్ ఉన్నాయా? కోమటిరెడ్డి బ్రదర్స్ దారెటు? తెలంగాణ PCC నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గం అసంతృప్తితో ఉంది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కి వచ్చిన ఆయన…ఎయిర్‌పోర్టులో చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్…
బీజేపీ వద్దన్నా.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఆయనపై చర్యలు ఉంటాయా? కాషాయ శిబిరాన్ని వదిలేయడానికే.. మోత్కుపల్లి ఈ ఎత్తుగడ వేశారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? మాజీ మంత్రి వివరణపై బీజేపీ సంతృప్తి చెందిదా.. లేదా? బీజేపీకి దూరం అయ్యారన్న అభిప్రాయం ఉందట టీడీపీని వీడి.. కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్…