తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మొన్న మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదని అన్నారు.…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 869 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 08 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1197 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. read also :హైదరాబాద్ లో మరోసారి భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,24,379 కు చేరగా.. రికవరీ…
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి లేడని…టీఆర్ఎస్కు డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ గెలవదని..వాళ్ళ పార్టీ నేతలను వాళ్లే కొనుక్కుంటున్నారని చురకలు అంటించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చలేదని మండిపడ్డారు. పోడు భూముల అంశంలో టిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని బండి…
ఈ రోజు ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 5.8 కిమీ వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణహెచ్చరికలు:- ఈ రోజు భారీ వర్షములు తెలంగాణాలోని నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాలలో రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. ఈ…
రాజకీయంగా వారిద్దరూ ఉద్దండులే. ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు. ఒకే పార్టీలో ఉన్నారు. ఆధిపత్యం కోసం వారు చేసే పనులు రచ్చ రచ్చ అయిన సందర్భాలు అనేకం. వారి మధ్య మళ్లీ నిప్పు రాజుకుంది. మాటలతో మంట పుట్టిస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? కొత్త రగడ దేనికోసం? లెట్స్ వాచ్! కండువా రంగులు కలిసినా.. మనసులు కలవలేదు తాటికొండ రాజయ్య… టీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరోనేత కడియం శ్రీహరి… మాజీ ఎమ్మెల్సీ. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేసినవారే. రాజకీయ…
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి నీటి విషయంలో అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున అప్పట్లో ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నీరు, ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా జలవివాదాలు జరుతూనే ఉన్నాయి. ఏపీలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యతరం తెలిపింది. Read: డాక్టర్స్ కు సెల్యూట్ చేస్తున్న స్టార్ హీరోలు ఇక, ఇదిలా…
హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కి అడ్డాగా మారింది.. బాంబుల ఫ్యాక్టరీ గా తయారయింది అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. కానీ డీజీపీ, కమిషనర్ లు ఆ విషయం పట్టించుకోకుండా గో రక్షకులను అరెస్ట్ చేయాలని అదేశిస్తున్నారు అని పేర్కొన్నారు. మీరు గో రక్షకులను అరెస్ట్ చేయాలి అంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి. బక్రీద్ కి ఆవులను, ఎద్దులను కోయండని డీజీపీ కమిషనరే చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఇంకా మేము…
శ్రీశైలండ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైల డ్యాం ఎడమగట్టు గేటు వద్ద పహార కాస్తున్నారు తెలంగాణ పోలీసులు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం నేపథ్యంలో భద్రత కల్పిస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం లోకి వెళ్లే వాహనాలను, సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 14,314 క్యూసెకులు ఉండగా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీపతి రవి (50) గత కొంతకాలంగా మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం కరోనా మహమ్మారి సోకడంతో దానికి చికిత్స పొందుతున్నాడు. అయితే పది రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ సోకడంతో హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు…
వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీరావు లంచం తీసుకుంటూ అనినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు.. పీఎన్ఆర్ సీడ్స్ పేరిట మొక్కల వ్యాపారం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని నర్సరీలకు మొక్కలు సరఫరా చేశారు. ఇందుకు బిల్లులు మంజురు చేయాల్సి ఉండగా.. డీఎఫ్వో బాబ్జీరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో మొక్కల వ్యాపారి నాగరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. నేడు రూ.3 లక్షల లంచం తీసుకొంటుండగా.. అధికారులు…