బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెంట్లం(భద్రాద్రి జిల్లా)లో 6.5, పెదవీడు(సూర్యాపేట)లో 3.3, పమ్మి(ఖమ్మం జిల్లా)లో 3.2 సెంటీమీటర్ల వర్షం…
గత మూడు నెలలుగా హుజురాబాద్ కి చీకటి అధ్యాయంగా పోలీసులు నిర్బంధం చవి చూస్తున్నది. నా రాజీనామా తర్వాత ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల వారిని ప్రోటోకాల్ సంభందము లేకుండా ఇంఛార్జ్లు వచ్చారు. హుజురాబాద్ ప్రజలపై తోడేళ్ళు గా విరుచుకుపడుతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలపై నాయకులపై నిరంతరం ఫోన్ ట్యాపింగ్ లు చేయడం నిఘా పెట్టడం చేస్తున్నారు…
రాజేంద్రనగర్ పుప్పాల్ గూడాలో కాందిశీకుల భూములలో వున్న నిర్మాణాలను కూల్చి వేస్తుంది రెవెన్యూ అధికారులు. పుప్పాల్ గూడాలోని సర్వే నెంబర్ 325, 326, 301, 303, 327, 328 గల నిర్మాణాలను జేసీబీల సహాయంతో కూల్చి వేసింది అధికారుల బృందం. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను కూల్చి వేసిన అధికారులు. కూల్చివేతను అడ్డుకున్న రైతులు. రైతులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం. పరిస్థితి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిర్మాణాలలో నివాసం వున్న మహిళలను బలవంతంగా బయటకు…
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వందల దిగువగా చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 245 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కన్నుమూశారు.. ఇదే సమయంలో 582 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,380 కు చేరుకోగా… కోలుకున్నవారి సంఖ్య 6,41,270 కు పెరిగింది……
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములవ్వాలనే తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… దళితబంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ వాళ్ళు దళితబంధు ఆపాలని కుట్రలు…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ సంఘాల నాయకులు కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వనించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో తక్షణమే కల్లుగీత కార్పొరేషన్ పాలకవర్గాన్ని ప్రకటించడంతోపాటు 5 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి…
తెలంగాణలో రేపటి నుండి రైతు రుణమాఫీ ప్రారంభం కానుంది. రూ.2005.85 కోట్ల రుణమాఫీ చేయనున్నారు. దీని ద్వారా రూ.50 వేల వరకు రుణాలున్న 6,06,811 మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. అయితే నేడు రుణమాఫీపై ట్రయల్ రన్ చేస్తున్నారు. రూ.25 వేల పైబడి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ చేస్తున్నారు. ఈ నెల 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. అయితే…
ఉద్యమకారుడు పోచమల్లును టీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు పోచమల్లు తెరాసలోకి వచ్చాడన్నారు. ఈ రోజు గెలిచేది న్యాయం, ధర్మం అని.. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదన్నారు. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పదన్న ఈటల, ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరిండని హరీష్ రావు కామెంట్స్ చేశారు. తల కిందికి కాళ్లుపైకి పెట్టిన ఈటల గెలవడని మంత్రి…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది దూకుడు పెంచింది. మరోవైపు.. బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది… హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం సాగుతోంది.. ఉప ఎన్నికలో మాజీ మంత్రి కొండా సురేఖను…
సిరిసిల్ల జిల్లాలో గతంలో చూడలేని అభివృధ్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్… 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. సిరిసిల్ల జిల్లాలో సమారు లక్షా 16వేల 577 మంది రైతులకు 812 కోట్ల రూపాయలను ముందష్తు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేసిందన్నారు.. ఋణమాఫీ సంబంధించి జిల్లాలో 25 వేల రూపాయలు ఋణం తీసుకున్న 10,289 మంది రైతులకు…