హుజురాబాద్‌లో ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేనా? ఆలస్యమయ్యే కొద్దీ ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం? జరుగుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్‌పై మూడు ప్రధాన పార్టీల ఫోకస్! మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌కు ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా రాలేదు. కానీ.. రాజకీయాన్ని రంజుగా మార్చాయి పార్టీలు. గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే అక్కడ…
హైదరాబాద్ లోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో మొత్తం 158 మంది ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన విద్యార్థులు ఉన్నారు అని యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ ప్రో. అప్పారావు తెలిపారు. ఓయూ హాస్టల్ లో నలుగురు ఉన్నారు. చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ రూమ్స్ అద్దె కి తీసుకుని ఉన్నారు. ఇప్పటివరకు విద్యార్థులు ఎవరూ ufro కార్యాలయానికి రాలేదు. మేమే స్టూడెంట్స్ ని ట్రేస్ చేస్తున్నాం. వాళ్ళు అడ్మిషన్ టైం లో ఇచ్చిన నెంబర్స్, ఇప్పుడున్న నంబర్స్ వేరేగా…
ఎప్పుడూ వేల మంది రోగులు, అటెండర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… బాధితురాలికి మత్తుమందు ఇచ్చి తన పశువాంఛను తీర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, మరో బాధితురాలి ఇంకా లేకపోవడంతో ఆందోళన మొదలైంది.. అసలు గాంధీ ఆస్పత్రిలో ఏం జరిగింది.. అత్యాచార ఘటనలో బాధితురాలి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు అనే అంశాలను పరిశీలిస్తే.. ఈ నెల 5వ తేదీన తన అక్క భర్తను గాంధీలో అడ్మిట్ చేసిన…
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న కారు టేకులపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరగగా.. ఈ ఘటనలో ఆయనకు స్వల్పగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని నర్సయ్యను చికిత్స కోసం ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స నిర్వహించారు.. ఈ ప్రమాదంలో కారు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది.. కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టుగా…
తాను ఎప్పుడూ పేదల ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనేనని .. సీఎం కేసీఆర్‌తో అనేక అంశాలపై పెనుగులాడానని గుర్తుచేసుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణ కాలనీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయొద్దని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని.. బయటికి చెప్పకపోయినా, అంతర్గతంగా కొట్లడానని..…
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారి దోపిడీ కలకలం సృష్టించింది. జలాలుద్దీన్ అనే బిస్కెట్లు వ్యాపారికి కత్తి చూపించి బెదిరించిన దుండకులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు అగంతకులు వ్యాపారిపై దాడి చేసి జేబులో నుంచి డబ్బులు లాక్కున్నారు. గంజాయి సేవించే గ్యాంగు తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఆధారంగా అగంతకులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వానలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి…
కరోనాతో గత రెండేళ్లుగా శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్‌ల్లోనూ మంచి ముహూర్తాలున్నాయని అంటున్నారు పురోహితులు. ఈనెలలో అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, బాజా భజంత్రీలు, వంట మాస్టర్స్‌తో పాటు ఫొటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కళ్యాణ మండపాలు, కన్వెన్షన్…
గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన పై గోపాలపురం ఏసీపీ వెంకట రమణ మాట్లాడుతూ… చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన బాధిత మహిళ ఆమె అక్క బావ తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 4 నుండి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలి బావ నరసింహులు అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు.…