హుజూరాబాద్ సీఎం సభ స్థలిని పరిశీలించారు మంత్రులు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అంతా ఒకేసారి జరుగుతుంది. మా జాతి బిడ్డల్లో చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోంది. హుజూరాబాద్ కోసమే 2 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. కాబట్టి ఆందోళన చెందకండి.. అందరికీ దళిత బంధు వస్తుంది. మొదట రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే నిందలు వేశారు. ఇక ఇప్పుడు దళిత బంధు కూడా అందరికీ ఇచ్చి…
ఇన్ని గంటలపాటు మీటింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారు అంటేనే… కాంగ్రెస్ పార్టీ పై మైనార్టీ సోదరులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ముక్క ని కర్ణాటక లో, ఒక ముక్క ని మహారాష్ట్ర లో, మరో ముక్క ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మైనార్టీ సోదరులు మరిచిపోవద్దు. ముస్లిం వ్యక్తి ని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంత్రి హరిష్ రావు మాట్లాడుతూ… ఎల్లుండి దళిత బంధు ప్రారంభం అవుతుంది. పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ను తీసుకున్నం అని తెలిపారు. బీజేపీ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దళిత బంధు పూర్తి దళిత బంధు కుటుంబాలకు అందిస్తాం. రైతు బంధు అమలప్పుడు కూడా ఇదే దుష్ప్రచారం చేశారు. రైతు బంధు కు చప్పట్లు కొట్టిన నేతలు, దళిత బంధు కు గుండెలు కొట్టుకుంటున్నారు. ఇక హుజురాబాద్ కోసం 2000…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు. రాష్ట్రంలో జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్ చేసుకోండి జెండా ఎగర వేసేందుకు, ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. ఏ దేశంలోనూ ,ఏ రాష్ట్రంలోనూ జాతీయ పథాకాన్ని ఎగరవేసేందుకు అనుమతి కోరరు. గోషామహల్ నియోజక…
దళిత బంధు అందరికీ అందించక పోతే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నున్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని కోరారు. 10 లక్షల రూపాయలు దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు. వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ ల అజమాయిషీ తీసివేయాలన్నారు. అందరికీ అందించకుండా…
తెలంగాణ మైనార్టీలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ‘మైనారిటీ గర్జన సభ’ లో ఆ పార్టీ నాయకురాలు గీతా రెడ్డి కామెంట్స్ చేశారు. మోదీ పెద్ద ఫేక్.. కేసీఆర్ అంత కంటే పెద్ద ఫేక్ అని ఆమె విమర్శలు చేశారు. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద మైనార్టీ మీటింగ్ చూస్తున్నాను. 45 లక్షల మందికి పైగా… ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రజల మైండ్ సెట్ మారాలి.. మార్పు తీసుకురావాలి…
ఆత్మహత్య లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది హుస్సేన్ సాగర్. నిన్ను ఒక్కరోజే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు ఐదుగురు మహిళలు. అయితే ఆ ఐదుగురిని లేక్ పోలీసులు కాపాడారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో గొడవలు, ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్యా యత్నంకి పాల్పడ్డారు మహిళలు. కానీ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కు అప్పగించారు పోలీసులు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 285 మందిని కాపాడిన లేక్ పోలీస్ లు కోవిడ్ తరువాత ఆత్మహత్యలు…
కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో దళితులు ధర్నా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. కాగా, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ…
వృద్ధాప్య పెన్షన్లకు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తగ్గించిన వయో పరిమితిని అనుసరించి అర్హులైన వాళ్ళు ఈ నెల 31 లోగా ఈ సేవ/మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి…
ఆగస్టు 19 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించబోయే.. జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం కానుంది. కోదాడ నుండి హైదరాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 19 సాయంత్రం నాలుగు గంటలకు కోదాడ లో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 20వ తేదీన దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట, వరంగల్ లో భద్రకాళి దర్శనం, వరంగల్, హనుమకొండ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఖిల్లాషాపూర్…