రాజకీయాల్లో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా వాడాలి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టేట్మెంట్ ఆ మాజీ మంత్రి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిందని టాక్. దీంతో పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథా? టీఆర్ఎస్లో ఉనికి కోసం పోరాటం? కడియం శ్రీహరి. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం. టీఆర్ఎస్ నాయకుడు. ప్రస్తుతం చేతిలో ఎలాంటి పదవి లేదు. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని…
దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో… బడులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర తర్వాత… విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో శానిటైజేషన్, క్లీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు… తరగతి గదులను శుభ్రం చేస్తున్నాయి. క్లాసు రూమ్‌లతో పాటు బెంచ్‌లు, కుర్చీలను… శానిటైజ్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే… ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల…
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ శివారులోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. దీంతో.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తేవేసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. హిమాయత్ సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1763.05 అడుగులకు చేరింది.. ఇక, ఇన్‌ఫ్లో కూడా భారీగానే ఉండడంతో.. గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.. ఇవాళ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మొదట ఒక్కో గేటు ఫీటు వరకు ఎత్తి…
టీఎస్ హైకోర్టులో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్ నమోదయ్యింది. ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వం ఎలాంటి గైడ్ లెన్స్ లేకుండా విద్యా సంస్థలు ప్రారంభించడాన్ని సవాలు చేసారు పిటీషనర్. దాంతో ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. అయితే నేడు పిటీషన్ పై…
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ సైతం జారీ చేసింది.. ఇక, భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఇక, నిన్న మానేరు వాగుపై ఉన్న లెవెల్ వంతెనపై ఆర్టీసీ బస్సు చిక్కుకు పోగా.. ఇవాళ ఉదయం ప్రవాహ ఉధృతి ఎక్కువవడంతో వంతెనపై చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వాగులో కొట్టుకుపోయింది.. వాగు పొంగి పొర్లుతుండడంతో బస్సును బయటకు తీసేందుకు…
టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే కెసిఆర్ నా? హరీష్ నా ? ఎవరు నిలబడతారో చెప్పాలని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ”మీ పోలీసులని, అధికారులను, మంత్రులను, డబ్బులు ఆపు, కొనుగోళ్లు ఆపి ప్రచారం చెయ్యి నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? ఆ దమ్ముందా?” అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తి పైసలతో రాదని.. ప్రజా బలంతో వస్తుందన్నారు. తాను…
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటును గుంజుకుంటాం.. ఏనుగెక్కి ప్రగతి భవన్ కు వస్తామని ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడమని… ఎన్నికల కోసమే దళితబంధు అని నిప్పులు చెరిగారు. నిజాంషుగర్ ను ప్రైవేటీకరణ చేసి వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఇక్కడి రైతులకు కావాల్సిన పసుపు బోర్డు తేవడంలో…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు మంచి.. క్రేజ్ ఉంది. ఏ ఛానల్ కు లేని ఆదరణ ఉంది. ప్రతి నిత్యం ప్రజల పక్షం అనే నినాదం ప్రజల గుండె చప్పుడై ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్… ముందుకు సాగుతోంది. 2007 సంవత్సరం లో ప్రారంభమైన ఎన్టీవీ ఛానల్.. నేటితో 14 వసంతాలు పూర్తి చేసుకుని… 15 వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యం లో రాజకీయ ప్రముఖులు, సినీతారలు, ప్రేక్షకులు,…
తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 340 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఒక్కరు మృతిచెందారు.. ఇదే సమయంలో 359 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,953 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3872 కు చేరుకుంది..…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం లో తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయింది. వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని…