పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేషాను పంపిణీచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్, పంజాగుట్ట సమీపంలో ఉన్న నెక్ట్స్ గలేరియా మాల్ లో సందర్శకులకు ఎం.పీ చేతులు మీదుగా విత్తణ గణపతులను పంపిణీ చేశారు. పూర్తిగా పర్యావరణహితంగా గణేష్ ప్రతిమలను తయారు చేయటం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమాన్ని చేపట్టినట్లు…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి హబ్’ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, మార్గదర్శకత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం పట్ల ప్రేమ, సాగునీటి రంగంపై ఉన్న శ్రద్ధతో ఈ ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ, సాగునీటి రంగంలో ఏ రాష్ట్రం సాధించని అద్వితీమయమైన విజయాలను సాధించిందన్నారు. ప్రపంచం అబ్బురపడే విధంగా…
ఆగస్టు వెళ్లిపోతోంది. అందరి చూపు కరోనా థర్డ్ వేవ్ మీదే ఉంది. ఎందుకంటే, సెప్టెంబర్, లేదంటే అక్టోబర్‌లో …ఎప్పుడైన థర్డ్ వేవ్ తడాఖా చూపొచ్చని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. అయితే దీని ప్రభావం సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మీడియా రిసెర్చ్ -ICMR తాజాగా ప్రకటించింది. కరోనా థర్డ్ వేవ్ దేశం అంతటా ఒకేలా ఉంటుందని ఎవరూ చెప్పలేరని మెడికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా…
మరోసారి హస్తినబాట పట్టనున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఈ సారి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.. కేసీఆర్ పర్యటనకు ఈసారి చాలా ప్రత్యేకత ఉంది.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న గులాబీ పార్టీ అధినేత.. హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.. ఇక, ఈ మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు.…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ… ఉప ఎన్నికలు ఎక్కడ జరిగిన టీఆరెఎస్ అబద్ధపు జీవోలు విడుదల చేస్తున్నారు. ఆ జీవోలు ఎక్కడ అమలు కావు ఆన్లైన్ లో ఉండవు. దేశం లో అవినీతి లో మొదటి స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలిచిన తరువాత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటికి వస్తున్నాడు. ఈటల రాజేందర్ రాజీనామా తో సీఎంఓ అఫీస్ లో…
తెలంగాణలో త్వరలోనే ఆయుష్మాన్ భారత్ అమలు కానుంది. ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్ పేరుతో అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. రెండు స్కీంలు కలయికతో వచ్చే సమస్యలు, సాధ్యసాధ్యాలపై ప్రభుత్వ కసరత్తు చేస్తుంది. అన్నీ ఒకే అయితే ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. కరోనాతో పాటు అనేక వ్యాధులకు చికిత్స ఇందులోనే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సలు అయుష్మాన్ ద్వారా అనుసంధానం కానున్నాయి. దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో…
టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే నంటూ మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆయన చేపట్టిన పాదయాత్ర మూడు రోజుకు చేరుకుంది.. ఇక, రాత్రి బసచేసిన బాపుఘాట్ దగ్గర ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజ నుంచి మంచి స్పందన ఉందన్నారు.. మొన్న ప్రారంభమైన పాదయాత్ర నిన్న రాత్రి 2 గంటల వరకు కొనసాగిందన్న ఆయన.. యువతీ, యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు పాదయాత్రకు బాగా మద్దతిస్తున్నారు.. మంగళ హారతులు…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని 177 కల్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది.. 5 సంవత్సరాల కాలపరిమితితో లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది టీటీడీ.. అయితే, ఓ వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ… మరో వైపు నిర్మించిన కల్యాణ…
సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. సూర్యాపేట మండలం రాజు నాయక్ తండా ఓ మహిళలను అందరూ చూస్తుండగా కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ దాడి చేశారు కొందరు వ్యక్తులు.. అయితే, ఇవాళ ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.. మహిళను వివస్త్రను చేసి కళ్లలో కారం కొట్టి వీధుల్లో తిప్పుతూ దాడి చేసిన తండావాసులను అరెస్ట్ చేసేందుకు ఆ గ్రామానికి వెళ్లారు సూర్యాపేట రూరల్ పోలీసులు.. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని…