ఆ ఇద్దరికి డ్రగ్స్ టెస్టు చేయించాలి.. ఖర్చులు నేనే భరిస్తా: రఘునందన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కేటీఆర్, రేవంత్ రెడ్డిల భాష చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు వారిని గమనిస్తున్నారు. ఒక దైవ కార్యం కోసం అమిత్ షాని కలిస్తే రేవంత్ మాట్లాడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి నోరు ఆయనకు అనేక ఇబ్బందులు పెట్టింది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విషయంలో నోరూపారేసుకొని పార్టీకి వివరణ ఇచ్చుకోలేదా..? రేవంత్ రెడ్డి పదవి తెచ్చుకుందే సూటు కేసులతో అని కాంగ్రెస్ నేతలు చెప్పారు అది నిజం కాదా..? సోనియా రాజ్యం అంటే 14 వందల మంది బలి తీసుకొనే రాజ్యమా..? 2004లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలంగాణ ఇస్తే 14 వందల అమరవీరులు ప్రాణాలు దక్కేవికదా..? అంటూ రఘునందన్ విరుచుకుపడ్డారు.
గజ్వెల్ సభ టిఆర్ఎస్ సహకారంతో జరిగిందేమో.. అనుమానం కలుగుతోందన్నారు రఘునందన్. నిన్న మొన్నటి వరకు నర్సారెడ్డి టీఆరెస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు రాలేదా..? కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్ కు పంపించి గజ్వెల్ లో సభ పెట్టించారో అనిపిస్తుంది. నిర్మల్ బీజేపీ సభకు పోటీగా కేసీఆర్ సహకారంతో సీఎం నియోజకవర్గంలో సభ అని అనుమానం మాకు ఉంది. కాంగ్రెస్ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరలేదా..? టీఆర్ఎస్, కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధం కాదా..? గతంలో టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ కాదా..? రేవంత్ రెడ్డి.. ముందు నీ మీటింగ్ లకు హాజరుకాని మీ సీనియర్ల సంగతి చూసుకో.. నీ పార్టీలో సమస్యలే పరిష్కరించుకోలేవు. ఎవరో వ్యక్తులు ప్రకటనలు ఇచుకుంటే బీజేపీ గిరిజనులను అవమానించింది అంటవా..? తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచనం దినోత్సవం అధికారిక నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. అవే డిమాండ్ లు నిర్మల్ సభలో అమిత్ షా చేస్తే మతవిద్వేషాలు రెచ్చగొట్టారని టీఆర్ఎస్ ఆరోపణలు చెస్తుంది. టీఆర్ఎస్ చేస్తే తప్పు లేదు గాని బీజేపీ చేస్తే తప్పు ఎలా అవుతుంది. పది జిల్లాలు పరిపాలించే మీరే రాజద్రోహం కేసులు పెడితే మేము దేశం అంత అధికారంలో ఉన్నాం మేము ఎన్ని కేసులు పెట్టాలి. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రేవంత్ రెడ్డి పీసీసీ పదవి వచ్చింది. హుజురాబాద్ ఎన్నికల్లో తేల్చుకుందాం రండి. రేవంత్ అన్న నాతో రా ఢీల్లికి.. అమిత్ షాను కలిసి కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేదాం. రేవంత్ రెడ్డికి చిత్తశుద్దిలేదు. రాజకీయకోసం ఆరోపణలు చేస్తున్నారు’ అని రఘునందన్ తెలిపారు.
Also Read
మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇద్దరికి డ్రగ్స్ టెస్టు చేయించాలన్నారు. ఇద్దరికి ఢీల్లిలో ఇండియా గేట్ వద్ద చేయిస్తే దేశ ప్రజలంతా చూస్తారు. డ్రగ్ పరీక్షలకు అయ్యే ఖర్చును నేనే భరిస్తా’ అంటూ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!