రండి.. మాట్లాడుకుందాం..! పన్నెండేళ్ల తర్వాత నాటి వైఎస్ మంత్రివర్గంలో ఉన్నవారికి.. YSతో సన్నిహితంగా మెలిగినవారికి పిలుపులు వెళ్తున్నాయి. రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం అని చెబుతున్నా.. కార్యక్రమం వెనక ఉద్దేశాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 2న ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక. ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వరస బహిరంగసభలు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. ఇదే టైమ్లో 12 ఏళ్ల క్రితం దివంగత…
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఛాతీ లో ఉన్నది గుండెనా? బండ నా? అంటూ తీవ్ర స్థాయి లో వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గజ్వేల్ లో నిరుద్యోగ నిరాహారదీక్ష అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని… వారికి అన్ని విధాలుగా తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ గజ్వేల్ కి ఏమి చేశాడని మండిపడ్డారు. తాలిబన్ల చేతి లో ఆప్ఘనిస్తాన్ ప్రజలు…
తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 338 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఒక్కరు మృతిచెందారు.. ఇదే సమయంలో 364 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,054 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,48,317 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3873 కు చేరుకుంది..…
హైదరాబాదులోని జలసౌధలో రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరుగనుంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ, తెలంగాణా రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలపై సమావేశంలో చర్చించనున్నారు. కేఆర్ఎంబీ పరిధి, సిబ్బంది కేటాయింపు, ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విశాఖ తరలింపు అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్రం.…
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, తన సోదరుడు డి. సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బాన్సువాడ, బోధన్ నియోజకవరర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అరవింద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంక్ లకు నేను దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరు. .డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. రేవంత్రెడ్డి తన కోపాన్ని…
ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలను ప్రారంభించ వద్దంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకురాలు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో 20 మంది బృందం మంత్రి నివాసానికి చేరుకొని మంత్రి అందుబాటులో లేకపోవడంతో నివాసం వద్ద బైఠాయించారు. మంత్రి వచ్చేవరకు కదిలేది లేదంటూ నివాసం వద్ద బైఠాయించారు. ఎంపీ సంతోష్ కుమార్ కు లబ్ధి చేకూర్చేందుకే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలలను ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు పాఠశాలలను…
దాదాపు 18 నెలల తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు… ఓవైపు రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇస్తూనే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు, మేనేజ్మెంట్పై ఒత్తిడి తేవద్దు.. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొంది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది.. గురుకులాలు, విద్యాసంస్థల్లో…