తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను తిట్టిన రేవంత్‌రెడ్డి.. లాఫుట్ గాడు, డొకవజీగాడు అని కూడా మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఏకంగా పురుగులు పడి చస్తాడంటూ శాపనార్థాలు కూడా పెట్టేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎంను తిడుతాడా అంటూ తీవ్రమైన పదజాలంతో మంత్రి మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. టీపీసీసీ అధ్యక్ష పదవి 50 కోట్లతోని తెచ్చుకున్న రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను తిట్టాడం ఎంటన్నారు. జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ బీజేపీ నుండి టిఆర్ఎస్ లోకి చేరికల కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.