సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల నిరాదరణ తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వoసం అయ్యింది అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మత్సకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుంది. కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం రూ.115 కోట్లతో 93 కోట్ల చేప పిల్లలను, 25 కోట్ల రొయ్య పిల్లలను జల వనరుల లో విడుదల చేస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో రూ.4 కోట్ల 87 లక్షల రూపాయలతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నాం అని తెలిపారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపారు. సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుంది. మత్స్య సంపద పెరగడంతో మత్స్య కారులకు ఆదాయం తో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుంది. మత్స్య కారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండుగ వాతావరణం లో ప్రతి చెరువులో చేప పిల్లల విడుదల చేయాలి. దేశంలో ఎక్కడా లేనివిధంగా సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటిటి కి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పెన్షన్ ల తో వృద్ధులకు, అభాగ్యులకు ఆదరణ, గౌరవం పెరిగింది. తోటపల్లి జలాశయం తో 75 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు అని అన్నారు.