హుజురాబాద్ లో రజక ఆత్మీయ సమ్మేళనములో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఈ రోజు మనందరం గర్వపడే రోజు ఈ రోజు చాకలి ఐలమ్మ పుట్టిన రోజు. గత ప్రభుత్వాలు చాకలి ఐలమ్మ జయంతి నీ అధికారికంగా జరపమంటే ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతి నీ అధికారికంగా నిర్వహిస్తున్నారు. 250 కోట్ల తో రజకుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రజకుల ఇస్త్రీ చేసుకునే వారికి 250 యూనిట్లు ఉచితం గా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం లో అన్ని కుల వృత్తులను కాపాడుకుంటుంది.బిజేపి ప్రభుత్వం బిస్ లకు ఎం చేసిందో చెప్పలి కనీసం ఒక బిసి సంక్షేమ శాఖ కూడా పెట్టలేదు. నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ ధరలను పెంచిన బిజేపి కి ఓటు తో నీ గుణపాఠం చెప్పాలి అన్నారు.
తెలంగాణ లో ఒక్క డబుల్ బెడ్ రూం కట్టిన మంత్రి ఈటల రాజేందర్. బిజెపి ధరలు పెంచి రైతుల ఉసురు పోసుకుంట అంటుంది. బిజెపి జెలువడం ద్వారా ఈ రకం గా హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలకు లాభం జరుగుతాదో ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి. గెళ్లు శ్రీనివాస్ ను ఆశీర్వదిస్తే నియోజక వర్గం లో ఐదు వేల డబుల్ బెడ్ రూం కట్టే బాధ్యత నేను తీసుకుంట.. రాబోయే రోజుల్లో ఎంబిసి కార్పొరేషన్ ద్వారా రజకుల కు లోన్లు ఇపీస్తం. గేల్లు శ్రీనివాస్ ను ఆశీర్వదిస్తే అన్ని మండల కేంద్రాల్లో చాకలి ఐలమ్మ భవనాలు నిర్మిస్తాం. కేంద్ర మంత్రులను హుజూరాబాద్ కు తేవడం కాదు హుజూరాబాద్ కు ఎం చేస్తారో చెప్పండి. పన్నులు వేసేవాళ్లు కావాలా పనులు చేసే వాళ్ళు కావాలా అలోచించండి. ఈటల రాజేందర్ మైక్ లో మాట్లాడుతున్నవంటే కేసీఅర్ వల్లే అని గుర్తు పెట్టుకోవాలే అని తెలిపారు.