తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో మాట్లాడారు. ఆ సమయంలో.. గతంలో నరసింహన్ గవర్నర్ గా సమయంలో రాజ్ భవన్ కు.. సీఎం ఆఫీస్ కు మధ్య మంచి సంభందాలు ఉండేవి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత రెండింటి మధ్య గ్యాప్ పెరిగిందా..? అనే ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం ఇస్తూ… దానిని దూరం అని నేను చెప్పను. అలాగే దగ్గరగా ఉన్నం అని కూడా చెప్పను. అయితే నరసింహన్ గారు ఇక్కడ 10 సంవత్సరాలకు పైగా గవర్నర్ గా ఉన్నారు. చాలా ముఖ్యమైన సమయాల్లో ఆయన ఇక్కడ భాధ్యతలు నిర్వర్తించారు. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న సంభంధం గురించి నేను మాట్లాడాను. కానీ నేను ఆయనకు ఏం చెప్పాలి అనుకున్న ఫోన్ లో చెప్తా. అది దూరం కాదు.. అలాగే దగ్గర కూడా కాదు. కానీ రాజ్యంగా పరమైన బాధ్యతలో నేను తగ్గను. మంచి స్నేహ అనేది సంబంధం పక్కన పెడితే… ఒక్క సీఎంగా ఆయన ఏం చెప్పాలో నాకు చెప్తారు. అలాగే రాజ్యంగాపరంగా ఒక్క గవర్నర్ గా నేను ఏం చెప్పాలో అది చెప్తాను. అందులో ఏం సమస్యలు లేవు. కానీ గత గవర్నర్ తో ఎలా ఉన్నారు.. నాతో ఎలా ఉంటున్నారు అనేదాని గురించి నేను మాట్లాడాను అని తమిళిసై సమాధానం ఇచ్చారు.