ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పరస్పరం ఫిర్యాదులు, లేఖల పర్వం కొనసాగగా.. గతంలో తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఇవాళ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని ఇటీవల కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అనుమతి లేకుండా…
సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న కెల్విన్‌కు నాంప్లి కోర్టు సమన్లు జారీ చేసింది.. అయితే, ఈ సమన్లు బోయిన్పల్లి కేసులో జారీ అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెల్విన్‌ను 2016లో బోయిన్‌పల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేవారు.. అతడి దగ్గర ఎల్ఎస్డీ రకం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్‌పై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం..…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. అటూ రాజకీయాల్లో, ఇటూ సినిమాల్లోనూ బీజీగా కొనసాగుతున్నారు. రాజకీయాలు పవన్ కల్యాణ్ కు కొత్తమే కాదు. ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు పవన్ లో రాజకీయ నాయకుడు పుట్టారు. నాడు ఆ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడంతో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లిన సంగతి అందరికీ తెల్సిందే. 2014లో పవన్ కల్యాణ్ పార్టీనైతే…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 68,097 శాంపిల్స్ పరీక్షించగా… 298 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 325 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,142కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,50,778కు పెరిగింది. ఇక,…
తెలంగాణ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తిన తాకింది.. తన పాదయాత్రకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.. కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ…
తెలంగాణలో ‘బండి’ దూకుడుకు సీఎం కేసీఆర్ కళ్లెం వేశారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగిందే తడువుగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఇచ్చేశారు. వారంతా కేసీఆర్ కు రెడ్ కార్పెట్ పర్చడం చూస్తుంటే ఢిల్లీ పెద్దల వద్ద కేసీఆర్ కు ఎంత పలుకుబడి ఉందో అర్ధమవుతోంది.…
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.. రూ. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఇకపై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించనుంది.. ఇక, విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలక తీసుకుంది తెలంగాణ ఉన్నత విద్యా…
కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్నాయి.. అయితే, పాఠశాల స్థాయిలో ప్రత్యక్ష బోధనకు స్కూళ్లను, విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని పేర్కొంది.. కేవలం ట్యూషన్…
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలను చీల్చి చెండాడాడు. టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలపై కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న మంత్రి కేటీఆర్ ఈరోజు బరస్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ ప్లీనరీ సాక్షిగా తన మౌనాన్ని బద్దలు కొట్టారు. తాజాగా జలవిహార్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి ప్లీనరీ సమావేశంలో ప్రత్యర్థులపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాన్న.. పందులే గుంపులుగా వస్తాయని.. సింహం సింగిల్ గా వస్తుంద’నే రీతిలో ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేశాడు. టీఆర్ఎస్…
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయవారసుడిపై అప్పడప్పుడు చర్చ తెరపైకి వస్తూనే ఉంటుంది… ఏ ఎన్నికలు వచ్చినా.. ఇదిగో ఈ ఎన్నికల తర్వాత కాబోయే సీఎం కేటీఆరే నంటూ విమర్శలు వచ్చిన సందర్భాలు ఎన్నో.. ఇక, అంతా అయిపోయేది.. కేటీఆర్ సీఎం అవుతున్నారంటూ ప్రచారం సాగిన సందర్భాలు అనేకం.. మరికొందరు కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయన మేనల్లుడు హరీష్‌రావు అనేవారు లేకపోలేదు.. కేటీఆర్ కంటే హరీష్‌రావు సీనియర్ అని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే…