తెలుగు రాష్ట్రాలకు వాన గండం.. అప్రమత్తమైన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలకు వాన గండం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. దీనికి గులాబ్ అని నామకరణం చేశారు. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను పలు రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు తుపాను హెచ్చరికలు జారీ చేసింది IMD.
ఈరోజు సాయంత్రం కళింగపట్నం వద్ద తుపాను సముద్రతీరం దాటే అవకాశముందని అంచనావేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. ఆంధ్రతోపాటు ఒడిశాలో ఈ తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉంటుందని ప్రకటించింది. వీటితోపాటు తెలంగాణ, చత్తీస్‌గడ్‌లలోనూ అక్కడక్కడ వర్షాలు పడుతాయని వివరించింది.
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. తుపాను తీరం దాటాక భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందున.. తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!