అవకాలు చెవాకులు పేలొద్దు.. జగన్ మాట్లాడితే నోరు తెరుస్తారు..? కూటమి నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన… పార్టీ కార్యకలాపాల విషయంలో అధికారులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మచిలీపట్నంలో మా పార్టీ సమావేశం పెట్టుకుంటే.. కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదం. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా పని చేస్తున్నారు అంటూ…
వేడుకలను విషాదంగా మార్చేస్తోంది చైనా మాంజా. నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారై, గాజు పొడి పూత కలిగిన ఈ దారం పర్యావరణానికి , ప్రాణకోటికి పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం 2016లోనే చైనీస్ మాంజాపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. దీనికి తోడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా 2017లో దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని నిషేధిస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ చైనా మాంజా వాడకానికి అడ్డుకట్టపడడం లేదు. చైనా మాంజా…
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు వ్యక్తులు. రాత్రికి రాత్రే 200 మందికి పైగా దుండగులు ప్రైవేటు భూమి వద్దకు చేరుకున్నారు. కంటైనర్, నేమ్ బోర్డులు, రేలింగ్ పైపులతో డీసీఎం, ట్రాలీ ఆటోల్లో అర్థరాత్రి వేళ వచ్చి హల్ చల్ చేశారు. జేసీబీల సహాయంతో ప్రహరీ గోడలను తొలగించి రేలింగ్ పైపులను పాతిన వైనం. దుండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగి వద్ద వదిలేసి వచ్చారు. Also…
రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. పిల్లలపై కూడా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొందరు దుండగులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల బాలికపై పాతికేళ్ల కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అశ్వరావుపేట మండలం ఊట్లపల్లిలో చోటుచేసుకుంది. బాలిక అనారోగ్యంతో ఉండటంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. బాలిక ఐదో నెల గర్భవతి అని వైద్యులు తేల్చారు. స్థానికులు చైల్డ్ డెవలప్మెంట్ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు…
భూ భారతి పోర్టల్ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వైనం జనగాం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భూ భారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి పూర్తిస్థాయిలో డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను కొల్లగొట్టినట్లు సమాచారం. సొమ్ములో కొంత మొత్తమే ప్రభుత్వ ఖజానాలోకి.. మిగతాదంతా సొంత ఖాతలోకే వెళ్తున్నట్లు అనుమానాలు. రూ.9 వేలకు…
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు వైన్ షాపులో విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు ఆంధ్రా లోని ఎన్టీఆర్ జిల్లా ఇనగడపకు చెందిన వేల్పుల గోపి(28)గా గుర్తించారు. వేంసూరు మండలం లింగపాలెం లోని అత్తింటికి వచ్చిన మృతుడు వేల్పుల గోపి. మృతుని బంధువులు యువకుడి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సీసీ టీవీపుటేజ్ పరిశీలిస్తున్న అధికారులు…
తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కావొద్దని అద్భుతమైన సంక్షేమపథకం కళ్యాణలక్ష్మిని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వధువుకు రూ.1,00,116 ఒకేసారి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కాగా కొంతమంది వ్యక్తులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. కళ్యాణలక్ష్మి పథకం కోసం నకిలీ పత్రాలు తయారు చేసి మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. Also Read:The Raja Saab: అర్ధరాత్రి…
మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ట్యాంకర్ ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. డీసీఎంలో ఉన్న టైల్స్ కూలీల మీద పడడంతో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డీసీఎం లో…
రాజధానిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ఎక్కడా లేదు..! ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎవరి వాదన వారిదిగా ఉంది.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానంటూ వైఎస్ జగన్ ప్రకటించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడమే కాదు.. కొత్త అవసరాలకు అనుగుణంగా మళ్లీ భూసమీకరణ చేపట్టింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని…