ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. దాదాపు 35కు పైగా అజెండా అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. MSME పరిధిలో వచ్చే ఐదేళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించింది.. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం..…
YS Jagan: ఇప్పుడే కృష్ణానదికి వరద నీరు ఇలా వస్తుంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. దాన్ని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్.. కొత్త రిజర్వాయర్లకు కాదు.. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపే కార్యక్రమమే ఇది.. తెలంగాణ, ఏపీ ఇద్దరూ ఒక్కటే.. తెలంగాణ ప్రాంతానికి నష్టం వచ్చే పనులు జగన్ ఎప్పుడూ చేయడని పేర్కొన్నారు.
సభకు ఎందుకు రావడం లేదు..? వైసీపీ ఎమ్మెల్యేల వివరణ కోరనున్న ఎథిక్స్ కమిటీ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హాజరుపై ప్రతీసారి చర్చ సాగుతూనే ఉంది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మొక్కుబడిగా ఒక్కరోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి వెళ్లిపోతున్నారు.. ఆ తర్వాత సెషన్ మొత్తం సభ వైపు చూడడం లేదు.. అయితే, వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో…
వారికి పవన్ కల్యాణ్ వార్నింగ్.. అనుమతులు ఉన్నా అడ్డు తగిలితే కఠిన చర్యలు..! అనుమతులు ఉన్న మైనింగ్ కు అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిబంధనల ప్రకారం మైనింగ్ చేసే వారిని బెదిరిస్తున్నారన్నారు.. ఇలాంటి వైఖరి మంచిది కాదన్నారు… పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరి కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే.. మధ్యప్రదేవాసులు…
CM Chandrababu: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం.. రెండు రాష్ట్రాల నేతలు, పాలక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు.. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదు అని హితవు పలికారు… దేవాదుల కట్టాం.. అది గోదావరి పైన ఉంది.. అక్కడి నుంచి పోలవరానికి నీళ్లు వస్తాయి.. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటాం అంటే అభ్యంతరం పెడితే ఎలా? అని ప్రశ్నించారు.. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గోదావరిలో…
వరంగల్ చౌరస్తాలో వివాహిత కత్తి పట్టుకుని హల్చల్ చేసింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నించింది. భార్య నుండి తప్పించుకునేందుకు జ్యువలరీ షాపులోభర్త దాక్కున్నాడు. వెంటనే డయల్100 కి ఫోన్ చేశాడు భర్త. అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహిళ చేతిలోని కత్తిని పోలీసులు లాక్కున్నారు. తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది వివాహిత జ్యోత్స్న. Also Read:Mahindra-Tata- M Evs: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ vs టాటా నెక్సాన్…
రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవారిని అంతమొందిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మళ్లీ మళ్లీ నిరూపిస్తు్న్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా కొండపాక (మం) తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం చిన్నల్లుడు అత్తను హత్య చేశాడు. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్న రాములమ్మ ( 55). ఆరు నెలల క్రితం తన పేరుపై ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఇద్దరు కూతుళ్లకి సమానంగా పంచుతానని…
పరారీలో ఉన్న అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డిని నిన్న రాత్రి హైదరాబాద్ లో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి స్టేషన్ నుంచి నాగిరెడ్డి పారిపోయిన విషయం తెలిసిందే. చోరీ కేసులో అరెస్ట్ అయిన తెలుగు నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డి. విచారణ కోసం కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకు వచ్చారు. వాష్ రూమ్ పేరుతో స్టేషన్ బాత్రూం నుంచి బయటికి వెళ్లి పరారయ్యాడు నాగిరెడ్డి. నాగిరెడ్డి పరారితో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు హెడ్…
మహబూబ్ నగర్ సీసీ కుంట మండలం ఫర్దిపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ఉజ్జయిని పుణ్య క్షేత్ర దర్శనానికి వెళ్తుండగా తుఫాన్ ను ట్రక్కు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు నర్సింహా (28), శివ (26) మృతి. మరో 9 మందికి గాయాలు అయ్యాయి. బాధితులంతా ఫర్దిపూర్ గ్రామస్థులే అని అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన…