ఢిల్లీ పర్యటనలో స్పెషల్ మిషన్‌పైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్లో పలుమార్లు కేంద్రం చెప్పినా.. ఆయన ఫోకస్ ఆ అంశంపైనే ఉందా? తాజా హస్తిన టూర్లోనూ ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారా? మరి.. త్వరలో క్లారిటీ వస్తుందా? ఇంతకీ ఏంటా అంశం? నియోజకవర్గాల పెంపు ఢిల్లీ టూర్లో ప్రస్తావించారా? పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలి. ఇదే…
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్దినా అన్నట్లుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అవిశ్రాంతంగా ముందుకు సాగుతుంది. మానవ మనుగడకు నేను సైతం అనే చేతులన్నీ ఒక్కటై మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. మరో మూడు హృదయాలను కదిలిస్తున్నాయి. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రపంచమంత కదలిస్తుంది. ఈ క్రమంలోనే, ఈ రోజు శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డా. డి వెంకటేశ్వరన్ “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ పార్క్…
తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది.. యూబీఐలో తెలుగు అకాడమీ డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు హాంఫట్ అయినట్టు ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది.. సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.. దీంతో.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీలో గోల్మాల్ అయిన నిధులు రూ.51 కోట్లకు చేరుకున్నాయి.. కార్వాన్, సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి ఈ…
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇక, గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది… ఇప్పటికే పలు దఫాలుగా హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించింది టి.పీసీసీ.. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తోంది..…
సినీ దర్శకనిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్ అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని.. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం దగ్గరకు వచ్చిన కొందరు దుండగులు.. పోసాని ఇంటిపై రాళ్లువిసిరారు.. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయిన రాళ్ల దాడికి పూనుకున్నారు.. ఊహించన ఘటనతో వాచ్‌మన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు దురయ్యారు.. అయితే, ఘటనా జరిగిన సమయంలో పోసానిగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ…
రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. ఖమ్మం రూరల్, గోదావరిఖని ఏసీపీలతోసహా 20 డీఎస్పీలను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది పోలిష్ శాఖ. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఏసీబీ డీఎస్పీ వంగా రవిందర్ రెడ్డి మెట్పల్లి ఎస్డీపీవోగా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఉన్న ఎండీ గౌస్ బాబాను మెట్పల్లి ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ కోసం వెయింగ్‌లో ఉన్న డీఎస్పీ…
మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించేలా చేస్తున్నారు కామాంధులు.. దేశవ్యాప్తంగా ఏదోఒక చోట వరుసగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా నిజామాబాద్‌లో దళిత యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు యువకులు.. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్ నుంచి…
తెలుగు అకాడమీలో అక్రమాలు వెలుగుచూశాయి.. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. వాటిని నిగ్గు తేల్చే పనిలో పడిపోయారు అధికారులు.. దాని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి.. ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శకనిర్మాత, రచయిత, సినీ నటుడు పోసాని మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. పోసాని వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు పవన్ అభిమానులు.. పోసానిపై దాడికి కూడా యత్నించారు.. పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుఫాన్‌గా మారి సెప్టెంబర్ 30న పాకిస్థాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుఫాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్‌లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో…