హుజూరాబాద్ సస్పెన్స్‌కు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షెడ్యూల్ విడుదలైంది. వాస్తవానికి ఈ నెల మొదట్లోనే నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అధికార టీఆర్ఎస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని కోరింది. అయితే ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్ దగ్గర ఉన్న చిన్న…
ఎట్టకేలకు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వ సూచనలతో గతంలో వాయిదా పడినా.. ఇప్పుడు షెడ్యూల్ వచ్చేసింది.. ఈ నేపథ్యంలో.. కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.. కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ ఇచ్చింది.. అక్టోబర్ 30న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 2 ఫలితాలు వెలువడతాయని తెలిపారు.. కోవిడ్ కేసులు ఇంకా వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. నిబంధనలు ఏవిధంగా…
తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికించింది. సైక్లోన్ ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా కురిసిన వర్షానికి.. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కురిసిన కండపోత వానకు భాగ్యనగరం ముగినిపోయింది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. జడివానతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చి చేరాయి. రోడ్లపై…
తన పాదయాత్రలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులను ఎవ్వరినీ వదలకుండా హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక, కేసీఆర్ సారూ వీటికి జవాబు చెప్పిండి అంటూ.. సీఎంకు 10 ప్రశ్నలు సంధించారు.. కేసీఆర్ జమానా – అవినీతి ఖజానా… అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి? కేసీఆర్ గారు మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు…
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. సోమవారం సాయంత్రం మరోసారి కేంద్ర హోం అమిత్ షా తో భేటీ అయ్యారు . తెలంగాణ లో తీవ్రవాద ప్రభావం, అభివృధ్దిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తోనూ.. సోమవారం మరో దఫా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి ఐదు రెట్లు…
ప్రముఖ ట్రావెల్స్ సంస్థ సదరన్ ట్రావెల్స్‌ను తెలంగాణ స్టేట్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు వరించింది.. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహించారు.. సెప్టెంబరు 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పురస్కారాలను ప్రదానం చేశారు.. “బెస్ట్ ట్రావెల్ ఏజెంట్” విభాగంలో సదరన్ ట్రావెల్స్‌ను అవార్డు వరించింది.. సంస్థ ప్రతినిధులు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.. ఇక, ఈ…
గులాబ్ తుఫాన్ తెలంగాణలో విధ్వంసమే సృష్టిస్తోంది… ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుగా ప్రకటించారు సీఎం కేసీఆర్.. ఇక, అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు.. భారీ వర్షాల వల్ల…
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాన్, భారీ వర్షాల వరదల నష్టాల అంచనాలకు నియోజక వర్గాలకు ఐఏఎస్ అధికారులను పంపించండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు, నగరాలు అతులాకుతలం అవుతున్నాయి. రాష్ట్రంలో పంటలు, ఇళ్ళు, రోడ్లు, చెరువులు, కాలువలు నష్టాలకు గురవుతున్నాయి. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయి, ఇళ్లు కూలిపోయి ప్రాణ…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవగా.. ఏకంగా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం.. అయితే, తెలంగాణలో భారీ వర్షాలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై.. వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు.…