హరితహారం పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు సీఎం కేసీఆర్. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా చొరవ అని… తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనికి ప్రకారం… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ…
నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే…
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్ఎస్కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్ఎస్ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను…
తెలుగు రాష్ట్రలో గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తోడు ఎగువ నుండి కూడా కొంత ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ కు మళ్ళీ వరద పోటెత్తింది. అయితే ఇప్పటికే సాగర్ నిండు కుండ లా మారింది. దాంతో సాగర్ ప్రాజెక్ట్ 6 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ జలాశయానికి 63,080 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉండగా ప్రాజెక్ట్ 6…
జగన్ తల్లి వైయస్ విజయమ్మ సోదరి, షర్మిల ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఊరట లభించింది. 2012లో పరాకల లో ఏర్పాటు చేసిన సభకు అనుమతికి సంబంధించిన కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభ ఏర్పాటు చేశారన్న అభియోగాలపై షర్మిల, విజయమ్మపై అప్పుడు కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కొండా సురేఖ కొండా మురళి తో పాటుగా తొమ్మిది మంది పైన పోలీసులు కేసు నమోదు…
జైళ్లశాఖ కొత్త డీజీగా డాక్టర్ జితేందర్ నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1982 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జితేందర్ లా అండ్ ఆర్డర్ డీజీ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జైళ్ల శాఖ డిజిగా ఉన్న రాజీవ్ త్రివేది ఇవాళ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో జైల్ శాఖ కొత్త డీజీ గా జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. – Ramesh Vaitla Read: జియో ఫిజిక్స్ ప్రొఫెసర్‌కు ఆ దేశ…
అధికారంలో ఉన్నప్పుడు వారంతా చక్రం తిప్పారు. పైగా పార్టీలో సీనియర్లు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఆహ్వానిస్తున్నా.. చప్పుడు చేయరు. హుజురాబాద్ ఉపఎన్నికపైనా నాన్చుడే. అన్నింటికీ తామే అని చెప్పే నేతలు..ఈ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? హుజురాబాద్‌ను పీసీసీ చీఫ్ సీరియస్‌గా తీసుకున్నారా లేదా? హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ప్రచార హోరులో కాంగ్రెస్ జెండా కనిపించడం లేదు. ఇంకా పాత కాలపు ఎత్తుగడలే. హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించడానికీ కాంగ్రెస్ నానా తంటాలు పడుతుంది. కొండా సురేఖ…
32శాతం దలితులు ఉన్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత రాహుల్, సోనియా గాంధీ లదే అని భట్టి విక్రమార్క అన్నారు. దళిత సీఎం ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే అమరేందర్ సింగ్ ను బీజేపీ నేతలు ఢిల్లీ కి పిలుపించుకున్నారు.. దళిత తుడికి సీఎం ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలి… కానీ పంజాబ్ లో రాజకీయ సంక్షోభం వచ్చినట్లు గా చూపెట్టడం సరైంది కాదు. దీన్ని నేను ఖండిస్తున్నా అని…
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి అందరికి తెల్సిందే. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇప్పుడిప్పుడే ప్రజల్లో గుర్తింపు దక్కుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన ఆరునెలల్లో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య, యువత ఆత్మహత్యలు, రైతు సమస్యలపై గళం విప్పుతున్నారు. యువత నుంచి…