తెలంగాణలో 26 ప్రైవేట్ జూనియర్ కాలేజీల భవితవ్యం అయోమయంగా మారింది. ఈ కాలేజీల్లో జాయినైన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. కాలేజీల షిఫ్టింగ్ కు నోటిఫికేషన్ వేసి ఇంటర్‌బోర్డు.. దరఖాస్తులు తీసుకుంది. అయితే 3 నెలలుగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన విద్యాశాఖ.. చివరకు అనుమతివ్వలేదు. షిఫ్టింగ్‌కు అనుమతి వస్తుంది అన్న ధీమాతో.. కొత్త ప్లేసులో కాలేజీలు అడ్మిషన్ తీసుకున్నాయి. అయితే, ఆ బిల్డింగ్‌ల ఫైర్ ఎన్వోసీల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్వోసీ వస్తే తప్ప అనుబంధ…
నిరుద్యోగ సమస్య పై ఆందోళన బాట పట్టాలని టి-కాంగ్రెస్ నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు సిద్దమైంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే అక్టోబర్ 2 నుండి.. డిసెంబర్ 9 వరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీలకు అతీతంగా… నిరుద్యోగ సైరన్ కి మద్దతు పలకాలని అప్పీల్ చేస్తోంది పీసీసీ. అక్టోబర్ 2న దిల్సుఖ్నగర్ నుండి.. ఎల్బీ నగర్లో శ్రీకాంత చారి ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం వరకు ర్యాలీ చేయాలని…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52,683 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 245 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 173 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,749కి చేరగా.. రికవరీ కేసులు 6,57,213కి…
జల జగడం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వార్ నడుస్తూనే ఉంది… ఇప్పుడు, విమర్శలు, ఆరోపణల పర్వం కాస్త ఆగినట్టే కనిపిస్తున్నా.. లేఖలు, ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యాల్లో తేడాను సవరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. 1952లో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్…
ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.. ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ప్రతి వరి గింజ కొంటామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వరి వేస్తే ఊరే అని ఏలా అంటున్నారు అని ప్రశ్నించారు. అయితే,…
తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యం అంటున్నారు.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్.. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల కోసం పనిచేస్తోంది. ఇవాళ లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలతో భేటీ…
తెలంగాణలో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక, దసరా కంటే ముందు నుంచే నిర్వహించే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రత్యేకం.. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దసరాను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం.. బతుకమ్మల సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తూ వస్తోంది.. ఈ ఏడాది కూడా ఇందుకోసం 289 రకాల చీరలు సిద్ధం…
కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ రోడ్డెక్కాయి విపక్ష పార్టీలు. భారతబంద్ పాటించాయి. ఈ విపక్షపార్టీల బృందానికి దూరంగా ఉండిపోయింది అధికారపార్టీ టీఆర్ఎస్. బంద్‌కు దూరం వ్యూహాత్మకమా? ఇంకేదైనా బంధాలకు బాట పడుతోందా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? భారతబంద్‌కు దూరంగా ఉన్న టీఆర్ఎస్పై చర్చ..! పెరిగిన పెట్రోల్, నిత్యావసరాల ధరలతోపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత్ బంద్ పాటించాయి కాంగ్రెస్, వామపక్షపార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు కొన్ని…
ప్రజాప్రతినిధులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల రూపాయల నుంచి 13 వేల రూపాయలకు పెరిగింది.. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6500కు పెంచుతూ పంచాతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, ప్రభుత్వ…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే హిమాయత్ సాగర్ చెరువు, అప్ప చెరువు తదితర ప్రాంతాల పరిస్థితిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్., రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్ డీ ఓ రాజేంద్ర నగర్ చంద్రకళ, జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్ హెచ్ఏఐ తదితర శాఖల అధికారులతో కలిసి ఈరోజు స్వయంగా…