తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతమ్మ (78) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. శాంతమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం కలిగిన విషయం తెలుసుకున్న పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకు సంతాపం తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Also: పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ పిక్ వైరల్
కాగా సంవత్సర కాలం ముగియకుండానే మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు మరణించారు. ప్రతిరోజూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతే వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి వెళ్లే ముందు సైతం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన తల్లి శాంతమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లగా ఆ తర్వాత ఓ సమావేశంలో పాల్గొనేందుకు బెంగళూరు వెళ్లారు. తల్లికి అనారోగ్యంగా ఉందని తెలియగానే హుటాహుటిన ఆయన బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు.
