మావోయిస్టు టాప్ లీడర్ ఆర్కే.. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించినా.. మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు.. శుక్రవారం మధ్యాహ్నం ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ప్రకటన చేసింది. కిడ్నీల సమస్యతో ఈనెల 14న ఆర్కే మరణించారని ఆ పార్టీ నేత అభయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు మావోయిస్టులు.. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు..…
సీనియర్ పొలిటికల్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. గత కొంత కాలంగా ఆయన కారెక్కుతారు అనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తున్నారు.. ఇక, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ను తెలంగాణ అంబేద్కర్గా అభివర్ణించారు.. మరోవైపు.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్లో చేరడం.. ఆయనను దళిత బంధు ఛైర్మన్గా నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.. ఈ…
పచ్చటి సంసారంలో సైతం కేసీఆర్ చిచ్చు పెడతారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ పుడితే టీఆర్ఎస్లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. ఉద్యోగాలు పీకేస్తాం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. వీటికి ఇచ్చే డబ్బులు…
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయ్. వైన్షాపులు, బార్లు కళకళలాడుతున్నాయ్. కరోన తరువాత కాస్త నెమ్మదించిన అమ్మకాలు.. ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తెలంగాణాలో మద్యం అమ్మకాలు మళ్లీ పెరిగాయ్. ప్రస్తుతం కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుతం దాదాపుగా 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం తో సర్కార్ ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. కరోనా…
విజయ దశమి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వమించారు.. ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్…సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించిన ఆయన.. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతులు, హిమాన్షు,…
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణం అందరినీ కదలిస్తోంది.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘకాలంలో విప్లవోద్యమంలో పనిచేసిన ఆయన.. చివరకు ఆ అడవి తల్లి ఒడిలోని కన్నుమూశారు.. అయితే, ఆర్కే మరణంపై మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆర్కేతో నాకు 1994 నుంచి పరిచయం ఉందని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకన్న ఆయన.. వివిధ అంశాల్లో కేంద్ర కమిటీ సూచించిన డైరెక్షన్ లో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు.…
తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది… ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిపై జీడివాగు వద్ద రేగా కాంతారావు కారు బోల్తా పడింది… బైక్ని ఓవర్ టెక్ చేయబోయిన సమయంలో.. కారు అదుపుతప్పి చెట్టుకుని ఢీకొట్టింది.. ఆ తర్వాత రోడ్డుకిందకి దూసుకెళ్లి బోల్తా పడింది.. ఈ సమయంలో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, ప్రమాదం సమయంలో కారులో రేగా కాంతారావు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. దాంతో ఈ సీజన్ లో ఐదవసారి రేడియల్ క్రేస్ట్ గెట్ అధికారులు ఎత్తారు. జలాశయం ఒక్క గెట్ 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో : 1,30,112 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 97,748 క్యూసెక్కులుగా ఉంది. ఇక పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత : 884.90 అడుగులుగా ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి…
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా…
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది… అంటే ఇది ట్రిప్ పాస్ ఆఫర్… దీనికి నిర్ణీత సమయం కూడా ఉంది… 45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు సరిపడా డబ్బులు చెల్లించి.. 30 ట్రిప్పులను పొందే అవకాశాన్ని ఈ ట్రిప్ పాస్ ద్వారా కల్పిస్తుంది హైదరాబాద్ మెట్రోల్ రైల్.. ఇక, నెలలో 20 మెట్రో ట్రిప్స్ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం…