భూముల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకుంది. ఆ బాధ్యతలను ఇకపై డిప్యూటీ తహసీల్దార్‌లకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్‌లకు ధరణి పోర్టల్‌లో లాగిన్ సౌకర్యాన్ని కల్పించింది. ఇకపై రిజిస్ట్రేషన్ వ్యవహారాల బాధ్యతలు కూడా వీళ్లే చూడనున్నారు.
ధరణి పోర్టల్‌ను ప్రారంభించి ఏడాది పూర్తికావడంతో.. వెబ్ సైట్ లో పలు మార్పులు చేర్పులు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు చూసిన తహసీల్దార్‌లకు ఆ భారం తప్పించింది. డిప్యూటీ తహశీల్దార్లకు ఆ విధులు అప్పజెప్పేందుకు సర్కార్ నిర్ణయించింది. ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్‌లు నిర్వర్తిస్తుండటంతో.. మిగతా రెవెన్యూ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు అందాయి. గతంలో తహసీల్దార్‌లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు లేనప్పుడు 50కి పైగా బాధ్యతలు నిర్వర్తించేవారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ప్రస్తుతం ఆ బాధ్యతలను పరిష్కరించేందుకు వీరికి సమయం లేకపోవడంతో చాలా పనులు పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో పలు జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలను తప్పించాలని నిర్ణయించింది. దీంతో పాటు తమకు పనిభారం ఎక్కువైందని రెవెన్యూ సంఘాల నాయకులు తహసీల్దార్ల తరపున సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయడంతో.. ఆ దిశగా అడుగులు పడినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో ఆర్డీవోలకు అనేక అధికారులు ఉండేవి. ఆ తర్వాత ఆర్డీవోల అధికారాలకు కత్తెర వేసి తహశీల్దార్లకు అదనపు భాద్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు పూర్తిస్థాయిలో తహసీల్దార్లు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అందుకే డిప్యూటీ తహశీల్దార్లకు ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌ను ప్రారంభించి గత అక్టోబర్ నెలకు సంవత్సరం పూర్తైంది. 574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏడాదిలో ధరణి పోర్టల్ ద్వారా 5.17 కోట్ల విలువ గల 10 లక్షల లావాదేవీలు జరగ్గా.. ధరణి ద్వారా లక్షా 80వేల ఎకరాల భూములకు సంబంధించి పట్టాదార్ పాసు పుస్తకాలను అధికారులు జారీ చేశారు. ధరణి పోర్టల్ లో మరో 20 సమస్యలు గుర్తించిన ప్రభుత్వం వాటిని పరిష్కరించడానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. నెలరోజుల్లో వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!