హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. తొలుత గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్.. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్‌రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఏడుసార్లు ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆరుసార్లు టీఆర్ఎస్, ఒకసారి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
Read Also: బట్టల షాపులోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్.. ఎగిరిపడ్డ యువకుడు
ప్రమాణస్వీకారం అనంతం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ కాలరాశారని విమర్శించారు. తాను రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వడానికి వస్తే.. కనీసం స్పీకర్ అందుబాటులో లేకుండా కేసీఆర్ వ్యవహరించారని గుర్తుచేశారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇచ్చారని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ అహంకారం, అణిచివేతపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు త్వరలోనే ఆయనకు గుణపాఠం చెప్తారని తెలిపారు. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ దిమ్మ తిరిగిందని.. అందుకే ప్రెస్‌మీట్లలో ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.