కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుండగా.. హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యాంగ మాట్లాడుతూ , ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, సంతలో కూరగాయలు…
టీఆర్ఎస్ పార్టీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, పట్టణ కమిటీలు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటైనట్టు కేటీఆర్ తెలిపారు. 2019 ఎన్నికల కారణంగా పార్టీ ప్లీనరీ కార్యక్రమం నిర్వహించలేకపోయామని, ఆ తరువాత కరోనా కారణంగా రెండేళ్లపాటు ప్లీనరీని నిర్వహించలేదని, నవంబర్ 15న వరంగల్‌లో విజయగర్జన జరుగుతుందని అన్నారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. అక్టోబర్ 17 వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్…
దేశంలో బొగ్గునిల్వల సమస్య ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే విద్యుత్ సంక్షోభం ఏర్పడవచ్చని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై నిన్నటి రోజుక కేంద్రం ప్రధాని నేతృత్వంలో సమీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం దేశంలోని బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బొగ్గు నిల్వలపై కేంద్రం దృష్టి పెట్టింది. దేశంలో మొత్తం 116 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు…
హుజురాబాద్‌కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నది. హరీష్‌రావు అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అయితే, ఇటు బీజేపీ కూడా పోటీ పోటీగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతానికి లోకల్లో బీజేపీ నాయకులు ప్రచారం…
మంత్రి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హరీష్ అన్న బాగా ఎగురుతున్నావట ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు అని వ్యాఖ్యానించారు.. అంతే కాదు.. అప్పుడు హరీష్ అన్నని గెలిపించాలని మళ్లీ మన యువకులు తిరగాల్సి వస్తది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈటల రాజేందర్ ను రాత్రికి రాత్రి…
పాలమూరు సభలో రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా…
గత కొన్ని రోజులుగా హెటిరోపై ఐటీశాఖ చేస్తున్న దాడులతో… దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. కోట్లకు కోట్ల రూపాయల నోట్లకట్టలు.. చూసి షాకవడం అధికారుల వంతైంది. హెటిరో సంస్థల్లో దొరికిన డబ్బును లెక్కపెట్టడానికే ఐటీ అధికారులకు రెండ్రోజులు పట్టిందంటే దోపిడీ ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. డబ్బునంతా అట్టపెట్టలు, ఇనుప బీర్వాల్లో దాచిపెట్టారని చెబుతున్నారు ఐటీ అధికారులు. కేవలం డబ్బును దాచిపెట్టడం కోసమే హెటిరో సంస్థ… కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందంటేనే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దొరికిన డబ్బులో…
గంజాయి రవాణా జోరుగా సాగుతూనే ఉంది.. దీంతో.. గంజ విక్రయదారులపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు.. ‘ఆపరేషన్ గంజా’ పేరుతో నగరంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.. ఇప్పటి వరకు 23 మంది గంజాయి విక్రయదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.. ఒకేసారి 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక, గంజా ఫ్రీ హైదరాబాద్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా.. ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్న…