కేసీఆర్ ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడిమసై పోతాడని మాజీ మంత్రి మోత్కు పల్లి నర్సింలు వార్నింగ్ ఇచ్చారు. నిన్న బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని… దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని మండిపడ్డారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? బీజేపీ నేతలకు సిగ్గు ఉందా? అని నిలదీశారు మోత్కుపల్లి.
కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోందని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలకు బుద్ధి ఉందా? ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలన్నారు. తన అనుభవంలో చాలామంది సిఎంలను చూసానని… దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నానని చెప్పారు. దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారు- బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారని… కొనియాడారు. బండి సంజయ్ కి సిగ్గులేదా? పిచ్చి వెధవ అంటూ ఫైర్ అయ్యారు.