మేడారం జాతర పనులను వేగవంతం చేయాలి: ఇంద్రకరణ్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడారం జాతర పనులను వేగవంతం చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ర్ట శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం జాతర ఏర్పాట్లను జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాలను, షెడ్లను, ఇతరపనులను అటవీ పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గత జాతరలో ఎదురైనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తుల క్యూలైన్లు, భారీకెడ్ల ఏర్పాటుకు పత్యేకంగా చూడాలన్నారు. కోవిడ్, ఒమిక్రాన్ వేరింయట్‌లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, స్నాన ఘట్టాల వద్ద అన్నిఏర్పాట్లు చేయాలన్నారు.
Read Also:ఏపీ, తెలంగాణకు కేంద్రం లేఖ.. విభజన సమస్యలపై చర్చిద్దాం రండి..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
రహదారుల వెంట ఆర్‌అండ్‌బీ అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, పార్కింగ్‌కుఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. పోలీసులు సీసీ కెమెరాలతో జాతర పనులను పర్యవేక్షించాలన్నారు. జాతర అనంతరం చెత్తతొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. జనవరి 15 నాటికి జాతర పనులన్ని పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అంతకముందు మంత్రులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!