గాంధీ ఆస్పత్రి మరో ఘనత.. దక్షిణాదిలోనే ఏకైక ఆస్పత్రి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనత అందుకుంది… జంట నగరాల్లో పెద్దాస్పత్రిగా ఉన్న గాంధీలో.. అనేక అత్యుధునికి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.. ఇక, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి కూడా మొదట ప్రభుత్వం గాంధీలోనే వైద్య సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఐసీఎంఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్(డీహెచ్‌ఆర్) అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్‌వర్క్’ (ఐఎన్‌టీఈఎన్‌టీ-ఇంటెంట్)కు గాంధీ ఆస్పత్రిని ఎంపిక చేశారు.. ఇంకో విషయం ఏంటంటే.. దక్షిణ భారత దేశం నుంచి ఈ ఘనత అందుకున్న తొలి ఆస్పత్రి గాంధీయే కావడం విశేషం.
దక్షిణాది రాష్ట్రాలకు ‘రీజినల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్’గా ఎంపికై రికార్డు సృష్టించింది గాంధీ ఆస్పత్రి.. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం పాలసీలు, కార్యక్రమాల రూపకల్పనకు కావాల్సిన ఆధారాలను క్లినికల్ ట్రయల్స్, ఇతర పరిశోధనల ద్వారా తయారుచేసేందుకు ఐసీఎంఆర్, డీహెచ్‌ఆర్ సంయుక్తంగా ‘ఇంటెంట్’ పేరుతో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.. ఇందుకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు భాగస్వామి కావాలని ఐసీఎంఆర్ ఈ మధ్యే దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.. అయితే, అన్ని అర్హతలను పరిశీలించిన తర్వాత గాంధీ ఆస్పత్రిని దక్షిణాదికి ‘రీజినల్ క్లినికల్ ట్రయల్ యూనిట్’ (ఆర్‌సీటీయూ)గా ఎంపిక చేశారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే క్లినికల్ ట్రయల్స్ గాంధీ ఆస్పత్రిలో జరగబోతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!