న్యూ ఇయర్ వేడుకల సమయంలో గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ.. కొత్త సంవత్సర వేడుకలకు అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారికోసం ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ.. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రత్యేకంగా నడపనున్నారు.. అయితే, ఒక్కరికి 100 రూపాయల చార్జ్ చేయనున్నట్టు వెల్లడించారు.. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి..
Read Also: ఏపీ: అవినీతిలో ఈ శాఖే టాప్..
ఇక, ఈవెంట్స్ కు వెళ్లే వారికోసం ఈ ప్రత్యేక బస్సులను రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నడపనున్నారు.. తిరుగు ప్రయాణం కోసం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించనుంది టీఎస్‌ఆర్టీసీ.. మరోవైపు.. 18 సీట్లు కలిగిన ఏసీ బస్సులో ప్రత్యేకంగా వెళ్లి రావడానికి రూ.4,000తో స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించింది ఆర్టీసీ. కాగా, అంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతున్న సమయంలో.. ప్రభుత్వం, పోలీసులు పెడుతున్న ఆంక్షలు మందు బాబులకు సమస్యగా మారాయి.. ఈ సమయంలో వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.