తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. ఈరోజు బిల్లింగ్ క్లోజ్ వరకు సుమారు 40 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. 34 లక్షల కేసుల బీర్లు అమ్మాకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలియజేసింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ చరిత్రలోనే ఇది రికార్డ్ అని, ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం ఇదే మొదటిసారి అని అబ్కారీ శాఖ తెలియజేసింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వైన్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, రెస్టారెంట్లు, పబ్‌లకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారు. ప్రత్యేక అనుమతులు ఇవ్వడంతో మద్యం సేల్స్ రికార్డ్ స్థాయిలో జరిగింది.
Read: కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికిన న్యూజిలాండ్…