కొత్త సంవత్సరం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ఇవాళ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆమె.. కేక్ కట్ చేశారు.. ఇక, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంపై ఫోకస్ పెట్టారు.. దాని కోసం రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా ఓ బాక్స్ ఏర్పాటు చేశారు.. రాజ్ భవన్ గేట్ దగ్గర ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశారు.. ఈ రోజు నుండి రాజ్‌భవన్ గేటు దగ్గర ఉన్న ఫిర్యాదుల బాక్స్‌లో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునే వీలు ఉంటుంది. ఇక, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 20 మంది పేద విద్యార్థులకు లాప్‌టాప్‌లు పంపిణీ చేశారు గవర్నర్.. వారిలో ఏడుగురు దివ్యాంగులు, 13 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. ఇక, ఫిర్యాదుల బాక్స్ గురించి గవర్నర్ మాట్లాడుతూ.. సలహాలు, సమస్యలు బాక్స్ లో వేయవచ్చు అని సూచించారు.. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా రాజ్‌భవన్ ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: న్యూ ఇయర్ జోష్.. ఏపీకి కిక్కు ఎక్కింది.. మద్యం మొత్తం ఖాళీ..!