తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అంటూ ప్రశంసలు కురిపించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇవాళ చాలా సంతోషంగా ఉంది.. కరోనా నేపథ్యంలో అందరూ భౌతికదూరం తోపాటు మాస్క్ ను ధరించాలని సూచించారు..
Read Also: నేరుగా గవర్నర్ దృష్టికి సమస్యలు.. రాజ్ భవన్‌లో ఫిర్యాదుల బాక్స్..
ఇక, ఒమిక్రాన్ రాకుండా ఉండాలి అంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలన్న ఆమె.. తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.. 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు వెల్లడించారు.. కరోనా విషయంలో రాష్ట్ర వైద్యారోగ్యా శాఖ కృషి అభినందనీయమన్న గవర్నర్.. ప్రభుత్వం, వైద్యారోగ్యా శాఖ మంత్రి, వైద్యారోగ్యా శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. దేశంలో పెద్ద రాష్ట్రం తెలంగాణ ఈ ఘనత సాధించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు.. ఇక, 2022లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు గవర్నర్.